పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

5

ట్రాన్స్‌వాలుకు రాజధాని ప్రిటోరియా. అది జోహన్స్‌బర్గ్‌కు 36 మైళ్ల దూరాన వున్నది. పరిపాలకులు, వాళ్లకు సంబంధించిన వాళ్లు అక్కడ వుంటారు, అందువల్ల ప్రిటోరియాలో వాతావరణం ప్రశాంతంగా వుంటుంది. జోహన్స్‌బర్గ్ వాతావరణం మాత్రం అశాంతిగా వుంటుంది. భారతదేశంలో ఏదేని గ్రామాన్నుంచి గాని, చిన్న పట్టణాన్నుంచిగాని ఎవరైనా బొంబాయి వెళ్లితే అక్కడి హడావుడి, వాహనాల రద్దీ, జనసందడి చూచి అదిరిపోయినట్లే ట్రాన్స్‌వాల్‌నుంచి మనిషి జోహన్స్ బర్గ్ వెళ్లితే అదిరిపోతాడు. జోహన్స్‌బర్గ్ ప్రజలు నడవరు, పరుగెత్తుతారు అని చెప్పవచ్చు. అందు అతిశయోక్తి ఏమాత్రమూ లేదు. తక్కువ సమయంలో తక్కువ శ్రమతో ఎక్కువ డబ్బు ఎలా సంపాదించడమా అనే అక్కడి ప్రతివాడి తపన. ట్రాన్స్‌వాల్ దాటి యింకా లోపలికి వెళ్లితే నారింజ పండ్లనిలయం అరంజియా వున్నది. దాని రాజధాని పేరు బ్లూమ్‌ఫోంటిన్. అదిచిన్న ప్రశాంతమైన సుందర నగరం. అక్కడ బంగారం, వజ్రాల గనులు లేవు. అక్కడి నుంచి కొద్ది దూరం రైలు ప్రయాణం చేస్తే కేప్ కాలనీ సరిహద్దు దగ్గరకు చేరుతాం. కేప్‌కాలనీ దక్షిణాఫ్రికా యందలి అతిపెద్ద అధినివేశరాజ్యం. దాని రాజధాని పేరు కేప్‌టౌన్. అది కేప్ కాలనీ యందుగల పెద్దహార్బరు. ఇది కేప్ ఆఫ్‌గుడ్‌ హోఫ్ (మంచి ఆశాద్వీపం) అనుదీవియందు వున్నది. యీ పేరు పోర్చుగీసు రాజు జాన్ పెట్టాడు. వాస్కోడిగామా దీన్ని అన్వేషించాడు. యిక్కడి నుంచి తమ వాళ్లు భారతావని చేరుటకు సులవైన దగ్గరిమార్గం దొరుకుతుందని రాజు భావించడమే అందుకు కారణం భారతావని చేరడం ఆకాలంలో సముద్రయాత్రలకు చివరి లక్ష్యం.

ఈ నాలుగు బ్రిటిష్ వారి అధినివేశరాజ్యాలు. యివిగాక బ్రిటిష్ వారి పరిపాలనలో మరికొన్ని ప్రదేశాలు కూడా వున్నాయి. యూరోపియన్లు రాకపూర్వం దక్షిణాఫ్రికా దేశవాసులు అక్కడ వుంటూ వుండేవారు.

దక్షిణాఫ్రికాలో ముఖ్యవృత్తి వ్యవసాయమే. వ్యవసాయానికి అది అనువైన దేశం. అక్కడి కొన్ని ప్రాంతాలు ఎంతో సారవంతమైనవి. అక్కడ తేలికగా పండేపంట మొక్కజొన్న. దక్షిణాఫ్రికా యందలి హబ్షీప్రజల ప్రధాన ఆహారం