పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

192

ఒడంబడికకు వ్యతిరేకత


తెరువు కల్పిస్తున్నది. ఆ ఈశ్వరుడే వాళ్లంతా కేవలం నిమిత్త మాత్రులే వారిలో ఎవ్వరూ నా ధార్మిక స్వాతంత్ర్యంలో అడ్డు తగలడానికి వీలులేదు యిదీ వారికీ నాకు మధ్యగల ముఖ్య షరతు అందువల్ల మీరు నన్ను గురించి ఏమీ చింతించకండి భారతీయుల మీద దయ చూపుటకు నేను మీ ఉద్యమంలో ప్రవేశించలేదు. యిది నా ధర్మమని భావించి మీ సంగ్రామంలో ప్రవేశించాను. నా చర్చి డీన్ (చర్చి పెద్ద) గారితో యీ విషయమై స్పష్టంగా మాట్లాడాను భారతీయులకు సేవాసహాయం చేయడం మీకు యిష్టం కాకపోతే చెప్పండి నేను వెళ్లి పోతాను మరో పాదరీని మీరు నియుక్తిచేసుకోండి అని వారికి వినమ్రంగా మనవి చేశాను. కాని వారు యీ విషయంలో నిశ్చింతగా వుండమని నాకు చెప్పారు. పైగా వారు నన్ను ఎంతో ప్రోత్సహించారు కూడా అంతేగాక తెల్లవారంతా భారతీయుల్ని అసహ్యించుకుంటున్నారని మీరు భావించకూడదు ఎంతమంది తెల్లవారు భారతీయుల దుస్థితిని చూచి బాధపడుతున్నారో, సానుభూతిని ప్రదర్శిస్తున్నారో మీరు వూహించలేరు అయితే ఆ విషయం అనుభవంలోకి రావాలని మీరు భావిస్తూ వుండవచ్చు"

ఇంత స్పష్టంగా చర్చ జరిగినందున యిక యీ విషయం నేనెన్నడూ వారి దగ్గర ఎత్తలేదు. తరువాత జాతీయ ఉద్యమం సాగుతూ వున్నప్పుడు తమ ధర్మ కార్యం నిర్వహిస్తూ రొడీషియాలో శ్రీ డోక్ దైవలోకానికి వెళ్లిపోయారు. అప్పుడు వారి సంప్రదాయానికి చెందిన వారంతా ఒక సభ చర్చిలో జరిపారు. ఆ సభకు కీ. శే. కాఛలియాగారితో బాటు నన్ను , యితర భారతీయుల్ని కూడా పిలిచారు. ఆసభలో నన్ను కూడా మాట్లాడమని కోరారు.

సుమారు 10 రోజుల్లో నా ఆరోగ్యం బాగుపడింది. బాగా తిరగసాగాను ఆస్థితికి వచ్చిన తరువాత మమత్వంతో నిండిన ఆ కుటుంబం వారి దగ్గర సెలవు తీసుకున్నాను యీ వియోగాన్ని మేమిరువురం భరించలేక పోయాము