పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

187

నేను - "అలావద్దు జీవించియుంటే, ఈశ్వరుడు అంగీకరిస్తే అందరికంటే ముందు నేనే పత్రం తీసుకుంటానని ప్రతిజ్ఞ చేశాను. అందువల్ల దయయుంచి మీరు కాగితాలు తీసుకురండి"

శ్రీ చమనీ అవసరమైన కాగితాలు తెచ్చుటకు తమ ఆఫీసుకు వెళ్లారు అటార్నీ జనరల్‌కు అనగా ప్రభుత్వ వకీలుకు తంతి పంపడం నా రెండో పని మీర్‌ఆలం, అతడి అనుచరులు నా మీద దాడిచేశారు. యిందువారి దోషం ఏమీ లేదు. ఏది ఏమైనా వారి మీద దొమ్మీకేసు పెట్టడం నాకు యిష్టం లేదు నా కోసం వాళ్లను వదిలివేస్తారని భావిస్తున్నాను నాయీ తంతి అందగానే మీర్‌ఆలం, అతడి అనుచరుల్ని వదిలివేశారు

అయితే జోహన్స్‌బర్గ్ యందలి తెల్లవారిలో అలజడి బయలు దేరింది వాళ్లు అటార్నీ జనరల్‌కు ఒక గట్టి జాబు పంపారు" అపరాధికి శిక్ష విధించు విషయంలో గాంధీ అభిప్రాయాలు ఎలా వున్నా, యీ దేశంలో దాన్ని అమలు చేయుటకు వీలులేదు గాంధీకి దెబ్బలు తగిలాయి. అందుకు వారు ఏమీ చేయకపోతే చేయక పోనీయండి కాని దాడి చేసిన వాళ్లు ఎవరి యింటిలోపలనో వారిని కొట్టలేదు బహిరంగంగా నడిరోడ్డుమీద కొట్టారు. అందువల్ల యిది బహిరంగ సామూహిక అపరాధం కొంతమంది ఆంగ్లేయులు కూడా సాక్ష్యం యివ్వడానికి సిద్ధంగా వున్నారు. అందువల్ల దోషుల్ని అరెస్టు చేసి తీరాల్సిందే " యిదీ వారి జాబు యందలి విషయం యిది ఉద్యమ రూపందాల్చే సరికి పోలీసులు మీర్ఆలంను, అతడి ఒక అనుచరుణ్ణి మళ్లీ అరెస్టు చేశారు ఒక్కొక్కరికి మూడు మూడు మాసాలకఠోర శిక్ష విధించారు. నన్ను మాత్రం సాక్ష్యానికి పిలవలేదు.

ఇక మనం రోగి గదికి వెళదాం శ్రీ చమనీ కాగితాలు తెచ్చుటకు వెళ్లారు యింతలో డా॥ ధ్యేట్స్ వచ్చారు. వారు నన్ను పరీక్షించారు. నా పై పెదిమ చీలిపోయింది. ఒక బుగ్గకు దెబ్బ తగిలింది. అందువల్ల కుట్లు వేసిరెండిటినీ కలిపి వేశారు. నరాలను పరీక్షించి మందు యిచ్చారు. కుట్లు విప్పనంతవరకు మాట్లాడవద్దని ఆంక్ష విధించారు. తరళపదార్థం తప్ప యింకేమీ తీసుకోవద్దని