పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

168

నిర్బంధాల వెల్లువ


ముగ్గురిని లాఠీలతో కొట్టారని కూడా తెలిసింది. అయితే మమ్మలందరినీ ఒకే జైల్లో ఒకేచోట వుంచారు. అందుకు చాలా సంతోషించాము

సాయంత్రం 6 గంటలకు మా కొట్టు తలుపులు మూసి వేశారు దక్షిణాఫ్రికాయందలి జైళ్ల తలుపులకు యినుపగడియలు, ఇనుప కడ్డీలు వుండవు గోడకు పై భాగాన ఒక చిన్న జాలీతో కప్పబడిన కిటికీ గాలి కోసం వుంది. అందువల్ల తలుపులు మూసేసరికి గల్లాపెట్టెలో పెట్టిమూసి వేసినట్లు మాకు అనిపించింది. జైలు అధికారులు రామసుందర్ పండితునికి చేసిన ఆదరసత్కారం మాకు చేయలేదని పాఠకులు గ్రహింతురుగాక యిందు ఆశ్చర్యం ఏమీ లేదు. రామసుందరపండితుడు ప్రధమ సత్యాగ్రహకైదీ అతడితో ఎలా వ్యవహరించాలో అధికారులకు బోధపడియుండదు. మా సంఖ్య ఎక్కువగా వున్నది యింకా చాలా మందిని ప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకోవాలి. మమ్మల్ని హబ్షీల వార్డులో వుంచారు. దక్షిణాఫ్రికాయందలి ఖైదీలలో రెండు వర్గాలు వుంటాయి. తెల్లవాళ్లు, నల్లవాళ్లు (హబ్షీలు) భారతీయ ఖైదులను కూడా హబ్షీ వర్గంలో చేర్చారు. నా అనుచరులందరికీ నా వలెనే రెండు మాసాల సామాన్య జైలు శిక్ష విధించబడింది

రెండో రోజు ఉదయం సామాన్య ఖైదు శిక్ష పొందిన ఖైదీలు తమ సొంత దుస్తుల్ని ధరించవచ్చునని, తమ బట్టలు ధరించడం వారికి యిష్టంలేక పోతే ఖైదీలకు యిచ్చే ప్రత్యేక దుస్తులు ధరించవచ్చునని తెలిసింది. అయితే మేము సొంత దుస్తులు ధరించవద్దని, జైల్లో వున్నంత కాలం జైలు దుస్తులే ధరించాలని నిర్ణయానికి వచ్చాం మా నిర్ణయాన్ని జైలు అధికారులకు తెలియ చేశాం మాకు సామాన్య ఖైదీలు ధరించే హబ్షీవారి దుస్తులు అందాయి. అసలు సామాన్య జైలు శిక్ష విధించబడిన ఖైదీలు పెద్ద సంఖ్యలో దక్షిణాఫ్రికాజైళ్లలో వుండరు. అందువల్ల అట్టిదుస్తుల కొరత జైల్లో ఏర్పడింది తగాదా పడటం మాకు యిష్టం లేదు అందువల్ల పెద్దశిక్ష పడ్డ హబ్షీఖైదీలదుస్తులు ధరించడానికి మేము అంగీకరించాము ఆ తరువాత జైలుకు వచ్చిన భారతీయులు యిట్టి దుస్తులు ధరించకుండా తమ సొంత దుస్తులే