పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

167


బోధించాను ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సంపదలు చివరికి ప్రాణాలు సైతం అర్పించవలసి వచ్చినా, సత్యాగ్రహి ఆనందంగా ఆర్పించడానికి సిద్ధపడాలని కూడా చెప్పాను ఆ నా జ్ఞానమంతా యిప్పుడు ఏమైంది? ఎక్కడికి పోయింది? యిట్టి భావాలు నాలో క్రొత్త శక్తిని నింపాయి నా మూర్ఖత్వాన్ని తలుచుకొని నవ్వుకున్నాను. యిక సామాన్యస్థితిలో ఆలోచించసాగాను మిగతామిత్రులకు ఏమి శిక్ష విధించబడిందో? వాళ్లను కూడా నాతో బాటు జైల్లో వుంచుతారో లేదో అని ఆలోచిస్తూ వుండగా యింతలో తలుపులు తెరుచుకున్నాయి. పోలీసు అధికారి తన వెనుక రావలసిందని నన్ను ఆదేశంచాడు. అతడి వెనుక నడుస్తూ వుండగా నన్ను ముందు వుంచి తాను నా వెనుకకు జరిగాడు జైలుకు సంబంధించి పంజరం వంటి వాహనం దగ్గరకు తీసుకు వెళ్లి యిందులో కూర్చోమని చెప్పాడు. నేను కూర్చున్నాను వెంటనే ఆ వాహనం జోహన్స్‌బర్గ్‌కు బయలు దేరింది

జైల్లో నా బట్టలు విప్పించివేశారు జైల్లో ఖైదీలను నగ్నంగా వుంచుతారని విన్నాను వ్యక్తిగతంగా అవమానం కలిగించనంతవరకు, మతరీత్యా వ్యతిరేకంకానంత వరకు జైలు నియమాల్ని పాటించాల్సిందేనని ముందుగా నిర్ణయించుకున్నాము. అక్కడ ధరించుటకు నాకు యిచ్చిన దుస్తులు మురికిగా వున్నాయి. వాటిని ధరించడానికి నా మనస్సు అంగీకరించలేదు కాని ఆ దుస్తులు ధరించాను మనస్సును ఒప్పించాను దుఃఖం కలిగినా, జైల్లో మురికిని సహించక తప్పదని నా మనస్సుకు నచ్చ చెప్పాను నా పేరు. అడ్రసు వ్రాసుకున్న తరువాత నన్ను ఒక పెద్ద కొట్లోకి తీసుకు వెళ్లారు కొద్ది సేపు నేను అందులో వున్నాను యింతలో నా అనుచరులు కూడా నవ్వుతూ మాట్లాడుకుంటూ అక్కడికి వచ్చారు. నేను వచ్చిన తరువాత వాళ్లకేసులు ఎలా నడిచాయో ఏమేమి జరిగిందో సవివరంగా నాకు చెప్పారు నా కేసు పూర్తి అయి నాకు శిక్ష విధించబడిన తరువాత కొంతమంది భారతీయులు నల్లజండాలు పట్టుకొని ఊరేగింపు జరిపారనీ, కొంతమంది ఉత్తేజితులైనారని వారివల్ల తెలిసింది. పోలీసులు ఊరేగింపును ఆపి యిద్దరు