పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

155


యీ హడావుడి వల్ల జాతికే లాభం కలిగింది. ఒక నెల గడిచిపోయింది రామసుందరపండిత్ జైలునుంచి విడుదల అయ్యాడు. మేళాతాళాలతో ఆయనను సభాస్థలి వరకు ఉరేగింపుగా తీసుకువెళ్లారు. కొందరు ఆ సభలో ఆవేశంతో ఉపన్యాసాలు యిచ్చారు. రామసుందర్ పండిత్‌ను దండలతో ముంచెత్తి వేశారు. ఆయన గౌరవార్థం కొందరు జనానికి పెద్ద విందు ఏర్పాటు చేశారు. అతడికి దక్కిన గౌరవాన్ని చూచి కొందరికి తీయని అసూయ కూడా కలిగింది. మనం కూడా జైలుకు వెళ్లి వుంటే మనకు కూడా యిట్టి గౌరవం దక్కి వుండేది కదా అని కొందరు తహతహలాడిపోయారు

కాని రామ సుందరపండిత్ నిజానికి సత్తురూపాయి రకం అతడిదంతా కృత్రిమ వ్యవహారం అతణ్ణి హరాత్తుగా అరెస్టు చేశారు కనుక ఒకనెల మాసం పాటు జైలు తప్పదని భావించారు. జైల్లో అతడికి లభించి యుందలేదు స్వేచ్ఛగా తిరిగే మనిషి అందులోనూ వ్యసనాలకు అలవాటుపడ్డ వాడు ఎంత మంచి భోజనం లభించినా, జైల్లో గల ఏకాంతవాసాన్ని, సంయమనాన్ని సహించలేకపోయాడు రాజభోగాలు అనుభవించినా అతడికి కారాగారవాసం రుచించలేదు. ట్రాన్స్‌వాల్‌ను, సత్యాగ్రహపోరాటాన్ని వదిలి రాత్రికి రాత్రే ఎక్కడికో పారిపోయాడు. ప్రతి సమాజంలోను గడుసురకం జనం వుంటారు అదే విధంగా ప్రతి ఉద్యమంలోను గడుసురకం చేరతారు. అతని వల్ల భారతీయులకు ఏమో ఒరుగుతుందని భావించి అతడికధ నాకు తెలియనీయకుండా గోప్యంగా వుంచారు. తరువాత అసలు రామ సుందర్, గిర్‌మిటియాగా దక్షిణాఫ్రికా వచ్చి ఆ ఎగ్రిమెంటు పూర్తి కాకుండానే పారిపోయిన ఒక గిర్‌మిటియా కార్మికుడని నాకు చెప్పారు. అతడు గిర్‌మిటియాకు చెందినవాడని నేను ఏహ్యభావంతో వ్రాయడం లేదు. అతడు గిర్‌మిటియా అవడంలో దోషం ఏమీ లేదు. నిజానికి భారతజాతీయ సత్యాగ్రహ పోరాటంలో పాల్గొని విజయపధాన నడిపించిన వారిలో గిర్‌మిటియా కార్మికులే ఎక్కువ అన్న విషయం పాఠకులు గ్రహింతురుగాక అయితే గిర్‌మిటియా కార్మికుడుగా వచ్చి, ఆ ఎగ్రిమెంటు పూర్తి కాకుండానే