పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

154

ప్రధమ సత్యాగ్రహఖైదీ


గౌరవిస్తూ వుండేవారు. ఉపన్యాసాలు యిస్తూ ఆవేశాన్ని కూడా నింపుతూ వుండేవాడు. అక్కడ ప్రభుత్వానికి దాసోహం చేసిన కొందరు భారతీయ ప్రభుద్దులు ఏషియాటిక్ శాఖ అధికారుల దగ్గరికి వెళ్లి యీ పండిత్‌ని ఆరెస్టు చేయండి. దానితో భయపడిపోయి జనం పత్రాలకోసం ఎగబడతారని రెచ్చగొట్టారు. ఆ ఆఫీసు అధికారి పొంగిపాయి వెంటనే రామసుందర్ పండిత్‌ను అరెస్టు చేయించాడు. ఈ రకమైన మొదటికేసు కావడం వల్ల పండిత్ అరెస్టు ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. భారతీయుల్లో పెద్ద అలజడి ప్రారంభమైంది. జర్మిస్టన్ వరకే ప్రచలితమై యున్న పండిత్ పేరు ఒక్క క్షణంలో దక్షిణాఫ్రికా యందంతట వ్యాపించింది ఏ ఒక్క మహాపురుషుణ్ణి అరెస్టు చేసినా అతడిపేరు సర్వత్ర వ్యాపించునట్లు రామ సుందర్ పండిత్ పేరు అంతటా వ్యాపించింది. అందరి దృష్టి ఆయన మీదకు మళ్లింది. అతణ్ణి అరెస్టు చేస్తే శాంతికి ప్రమాధం ఏమీ కలుగకపోయినా ప్రభుత్వం అందుకు పూనుకొని పెద్ద ఏర్పాట్లు చేసింది ఒక పెద్ద భారతీయ నాయకుడి హోదా అతడికి కల్పించి ప్రభుత్వం పెద్ద అట్టహాసం చేసింది. అతడికి గౌరవం కల్పించింది. విచారణ జరిగిన రోజున కోర్టు అంతా జనంతో క్రిక్కిరిసి పోయింది. అతడికి ఒక నెల రోజుల పాటు సాధారణఖైదు శిక్ష విధించారు. అతణ్ణి జోహన్స్ బర్గ్ జైల్లో వుంచారు. అక్కడ యూరోషియస్ వార్డులో అతడికి ప్రత్యేకించి ఒక గది కేటాయించారు. జనం ఏమి యిబ్బంది లేకుండా అతణ్ణి కలుసుకొనే ఏర్పాట్లు చేయబడ్డాయి బయటి నుంచి భోజనం తెప్పించుకొనే ఏర్పాటు కూడా చేశారు. దానితో భారతీయులు రోజూ రుచికరమైన భోజనం అతడికి పంపిస్తూ వున్నారు అతడికి జైలు శిక్ష విధించబడిన రోజున పెద్ద జాతీయ ఉత్సవం జరిగింది అతణ్ణి జైల్లో పెట్టినందు వల్ల జాతికి బలం, ఉత్సాహం అధికంగా లభించాయి. వందలాది భారతీయులు జైలుకు వెళ్లుటకు సిద్ధపడ్డారు ఏషియాటిక్ శాఖ ఆశించిన ఆశ నెరవేరలేదు. జర్మిస్టస్ యందలి భారతీయులైనా అనుమతి పత్రాలు తీసుకొనుటకు ముందుకు రాలేదు. అధికారులు చేసిన