పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

153


జరిగింది కూడా ఫలానా రోజున. ఫలానరాత్రి, యిన్ని గంటలకు ఫలానా కొట్లో పత్రాలు ఫలానా ఫలానా వాళ్లు తీసుకోబోతున్నారు అని ఆఫీసుకు సమాచారం అందింది. ఆ వార్త అందగానే అట్టి వాళ్ల దగ్గరకు వెళ్లి అలా చేయవద్దని నచ్చచెప్పారు. ఆకొట్టు దగ్గర పికిటింగు కూడా చేశారు. అయినా నాటిరాత్రి 11 గంటలకు భారతీయ నేతలు కొందరు రహస్యంగా పత్రాలు తీసుకున్నారు. ఇలాంటి ఘట్టంవల్ల ఒక సిద్ధాంత ప్రకారం సాగుతున్న ఉద్యమానికి విఘాతం కలిగింది. మర్నాడే ఆ పెద్ద మనుష్యులపేర్లు పత్రికల్లో ప్రకటించబడ్డాయి. మనిషి పడే సిగ్గులజ్ఞలకు కూడా ఒక హద్దనేది వుంటుంది! దీనికంతటికీ కారణం స్వార్థమే స్వార్థం జడలు విరబోసుకునేసరికి మనిషి జారిపోతాడు. సిగ్గులజ్ఞలు అతణ్ని ఏమీ చేయలేవు ఈ విధంగా అంతఃకలహాలకు లోనై సుమారు 500 మంది భారతీయులు పత్రాలు పుచ్చుకున్నారు. కొద్ది రోజులు యీ తతంగం సొంత ఇళ్లలో జరిగింది. మెల్ల మెల్లగా అట్టివారిని చలివదిలి వేసింది ఆ తరువాత బహిరంగంగానే ఏషియాటిక్ ఆఫీసుకు వెళ్ళి అనుమతి పత్రాలు తీసుకోవడం ప్రారంభించారు



18

ప్రధమ సత్యాగ్రహఖైదీ

ఎంత కష్టపడ్డా 500కి మించి భారతీయుల పేర్లు రాకపోయేసరికి ఏషియాటిక్ శాఖకు సంబంధించిన అధికారులు భారతీయులను అరెస్టు చేయడం అవసరమని నిర్ణయానికి వచ్చారు. పాఠకులకు జర్మిస్టస్ పేరు తెలుసుకదా! అక్కడ భారతీయులు చాలామంది ఉంటున్నారు. వారిలో ఒకని పేరు రామసుందర్ పండిత్ అతడు చూచుటకు శూరుడు వీరుడుగా కనబడేవాడు వాచాలుడు కొద్ది సంస్కృత శ్లోకాలు అతడినోటికి వచ్చు ఉత్తర ప్రదేశ్‌కి చెందినవాడు కనుక తులసీ రామాయణ మందలి కొన్ని దోహాలు, చౌపాయీలు కూడా అతనికి వచ్చు పండిత్ కనుక జనం అతణ్ని