పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

152

ప్రధమ అంతఃకలహం


వాళ్లను చేశారు. బయట పడకుండా రహస్యంగా యిట్టి పనులు చేసే వారంతా బలహీనులే బలహీనులు ఏదో విధంగా దెబ్బతీయాలని చూస్తూ వుంటారు

అయితే యిట్టి బెదిరింపులకు భారతీయులు భయపడలేదు. కాని పత్రాలు తీసుకున్న వాళ్ల పేర్లు బయటపడక తప్పదనీ, మిగతా వారి దృష్టిలో దిగజారిపోతామని అట్టివారికి భయం పట్టుకుంది. రక్తపు చట్టానికి తలవంచడం మంచిది అని అన్న ఒక్క భారతీయుడుకూడా నాకు కనబడలేదు. కొంత మంది కొత్త పత్రాలు తీసుకుందామని వెళ్లారు గాని, తమ పిరికితనానికి వాళ్లే బాధ పడ్డారు. ఇటువంటి ఘట్టాలు ఎన్నో జరిగాయి

ఒకవైపున సిగ్గు లజ్జ, మరోవైపున తమ వ్యాపారానికి దెబ్బతగలకుండా కాపాడుకోవడం యీ రెండిటి మధ్య వ్యాపారస్థులు కొందరు యిరుక్కుపోయి భాదపడ్డారు. కాని చివరకు వాళ్లు ఒక ఉపాయం కనుక్కున్నారు. అట్టివాళ్లు ఏషియాటిక్ శాఖాధికారి దగ్గరకు వెళ్లి మాట్లాడి, ఫలానా చోటఫలానా వారి సొంత యింట్లో రాత్రి 9 లేక 10 గంటల తరువాత అనుమతి పత్రాలు అందజేయండి. తీసుకుంటాం అని చెప్పి ఆయనను ఒప్పించారు. ఇలా అయితే తాము రక్తపు చట్టానికి లొంగిపోయినట్లు బయటపడదని వారు భావించారు. తామంతా జాతి నాయకులం గనుక, ఎవ్వరూ ఏమి చేయలేరు పని నడిచిపోతుందని వారు అనుకున్నారు. అందరిముందు సిగ్గు పడవలసిన అవసరం వుండదని, తరువాత బండారం బైటపడ్డా పరవాలేదని ఉహించారు

కాని వాలంటీర్లు జాగ్రత్తగా వున్నారు. ఎప్పటికప్పుడు సమాచారం జాతికి అందిపోతూవున్నది. ఏషియాటిక్ ఆఫీసులో వున్న వాళ్లు కూడా అఖండులే ఇటువంటి రహస్య సమాచారం ఏమైనా వుంటే వాళ్లు సత్యాగ్రహులకు చేరవేస్తూ వుండేవారు. మరో రకం బలహీనులు కొందరు వుండేవారు. వాళ్లు తాము బలహీనులే అయినా నాయకులు బలహీనపడితే సహించ లేకపోయేవారు వాళ్లు తమకు తెలిసిన నాయకుల బలహీనతల్ని ఎప్పటికప్పుడు వాలంటీర్లకు తెలియజేస్తూ వుండేవారు. ఇటువంటి ఘట్టం ఒకనాడు