పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

144

అహమద్ ముహమ్మద్ కాఛలియా


ఈకకు పీకలు పీకడం, మీనమేషాలు లెక్క పెట్టడం వంటి పనులు. కేవలం వకీళ్లు, ఆధునిక విద్య గడించిన వేత్తలేకాక, అక్షరం ముక్క రాని వాళ్లు అజ్ఞానులు అనుకున్న వాళ్లు కూడా చేస్తున్నారు. దక్షిణాఫ్రికాలో యీ అనుభవం నాకు కలిగింది. మొదటిసారి ప్యాసైన ఖూనీ చట్టం నిరాకరించబడింది. కనుక యూదుల నాటకశాలలో చేసిన మన ప్రతిజ్ఞ నెరవేరింది అని కొందరు క్రొత్త వాదన లేవదీశారు. ప్రతిజ్ఞాపాలన యందు వెనుకంజ వేసిన వాళ్లకు యీ వాదనసాకుగా దొరికింది. అయితే వాళ్ల వాదనలో కొంత సత్యం వున్నది. కాని దాన్ని చట్ట రూపంలోగాక, అందలి చెడును ఎదిరించిన వారికి మాత్రం, యీ వాదన నచ్చలేదు. వీటన్నిటినీ గమనించి, రక్షణ దృష్ట్యానేగాక, జాతిలో యింకా జాగృతి కలిగించాలని, జనంలో వచ్చిన బలహీనతలను తొలగించాలని భావించి మళ్లీ క్రొత్తగా జనం ప్రతిజ్ఞ చేయడం మంచిదనే నిర్ణయానికి నేను వచ్చాను. అందుకోసం పలుచోట్ల సభలు జరిపి ప్రజలకు బోధ చేశాము. తిరిగి ప్రతిజ్ఞ కూడా చేయించాము ప్రజల ఉత్సాహంలోగాని, ఆవేశంలోగాని ఎట్టి మార్పు రాలేదని తేలింది.

జూలై మాసంలో విధించబడిన గడువు దగ్గరికి వచ్చింది. జూలైనెల చివరి తేదీన ట్రాన్స్‌వాల్ రాజధానీ నగరమైన ప్రిటోరియాలో భారతీయుల పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం ఇతర పట్టణాలనుంచి కూడా చాలామంది ప్రతినిధుల్ని ఆహ్వానించాం. ప్రిటోరియా యందలి మసీదు ప్రాంగణంలో సభ కోసం ఏర్పాట్లు జరిగాయి. సత్యాగ్రహం ప్రారంభమైన తరువాత జనం సభల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన సాగారు అందువల్ల యిండ్లలో సభ జరపడం సాధ్యం కానందున మసీదుల విశాల ప్రాంగణాల్లో సభలు ఏర్పాటు చేయడం ప్రారంభించాం. ప్రిటోరియా పట్టణంలో గల భారతీయుల సంఖ్య 1300 వరకు వున్నది. వారిలో 10000 మంది జోహన్స్‌బర్గు, ప్రిటోరియాల్లో వుంటున్నారు. వారిలో 6000 మంది వచ్చి సభలో పాల్గొన్నారు అని అంటే ప్రపంచమందలి ఏదేశంలోనైనా యిది