పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

143


పోరాటానికి శక్తినిబట్టి సహకరించాలని, సత్యాగ్రహాన్ని మినహాయించి మిగతా కార్యక్రమాలన్నింటికి సంస్థలు సహకరించాలని అంతా నిర్ణయానికి వచ్చారు తరువాత సత్యాగ్రహులంగా కలసి “పాసివ్ రెసిస్టెన్స్ అసోసియేషన్" లేక సత్యాగ్రహ మండల్ అను పేరట క్రొత్త సంస్థను స్థాపించారు. ఇంగ్లీషు పేరువల్ల అప్పటికి సత్యాగ్రహం అను పేరు యింకా నిర్ణయం కాలేదని పాఠకులు గ్రహించవచ్చు. ఆ తరువాత జరిగిన కార్యక్రమాల వల్ల, యీ క్రొత్త సంస్థను స్థాపించినందువల్ల భారతజాతికి ఎంతో మేలు జరిగింది. అలా జరిగియుండకపోతే సత్యాగ్రహ పోరాటానికి నష్టం కలిగి యుండేదే చాలా మంది యీ క్రొత్త సంస్థలో మెంబర్లుగా చేరడమే గాక డబ్బుకూడా బాగా యిచ్చి సహాయం చేశారు

డబ్బు లేని కారణంగా ప్రపంచంలో ఏ సంస్థ మూత పడదని. ఆగిపోదని, నిస్తేజపడదని అనుభవంవల్ల తెలుసుకున్నాను. అయితే ప్రపంచంలో సంస్థలు డబ్బు లేకుండానే నడుస్తాయని భావించకూడదు నిజాయితీ కలిగిన సచ్చరిత్రులు నడిపే సంస్థలకు డబ్బులోటు వుండదు దానంతట అదే లభిస్తుంది. దానితోబాటు డబ్బు వరదలా వచ్చిపడితే యిక ఆ సంస్థకు పతనం తప్పదని కూడా అనుభవం వల్ల తెలుసుకున్నాను. ఈ అనుభవాలన్నిటి వల్ల నేను మూల ధనం బాగా పెంచి, దాన్ని నిల్వచేసి, తద్వారా వచ్చే వడ్డీతో సంస్థల్ని నడపడం మహాపాపమని అనలేనుగాని, అది అనుచిత చర్య అని మాత్రం అనగలను ప్రజాసంస్థలకు అసలు ప్రాణం ప్రజలే ప్రజలు కోరినంత వరకే యిట్టి సంస్థలు, పనిచేయాలి మూలధనం సంపాదించి దానివడ్డీతో నడిచే సంస్థలు ప్రజాసంస్థలుగా వుండవు. అవి స్వేచ్ఛా సంస్థలుగానో, నియంత్రిత సంస్థలుగానో అయిపోతాయి. ప్రజల విమర్శలనే అంకుశం దానికి వుండదు. వడ్డీ సాయంతో నడుస్తున్న పలు ధార్మిక, సాంఘిక సంస్థలు ఎంతగా కుళ్లిపోయాయో చర్చించుటకు యిక్కడ తావు లేదు. అయితే యిది అందరికీ తెలిసిన విషయమే

ఇక మనం అసలు విషయానికి వద్దాం సూక్ష్మాతిసూక్ష్మ వాదనలు చేసి