పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

135


ఉదయం, సాయంత్రం, సొమ్ము తీసుకోకుండా మాకు సాయం చేశారు వారిలో ఒక్కరు కూడా గౌరవ ప్రతిష్టల్ని ఆశించ లేదు. పేర్లు. చిరునామాలు వ్రాయడం, నకళ్లు వ్రాయడం, పోస్టల్ బిళ్లలు అతికించడం, ఉత్తరాల్ని పోస్టు చేయడం మొదలుగా గల పనులన్నీ చేశారు. అట్టి వారందరినీ మరిపించివేయగల నిష్కామ సేవి సిమండ్స్ అనుపేరుగల ఆంగ్లయువకుడు అతణ్ణి దక్షిణాఫ్రికాలో మొట్టమొదటిసారి కలిశాను భారత దేశంలో కొంతకాలం వుండి వచ్చిన మంచి మిత్రుడు భగవంతుడు ఎక్కువ ప్రేమించిన వాళ్లను త్వరగా తన దగ్గరికి పిలిపించుకుంటాడు అని ఇంగ్లీషులో ఒక సామెత వున్నది. వరడు: ఖభంజకుడగు యీ ఆంగ్లేయుణ్ణి కూడా యమదూతలు అతడు యెవ్వనంలో వుండగానే తీసుకు వెళ్లారు. పరదు:ఖభంజకుడు అను వివేషణ ప్రయోగానికి ఒక కారణం వున్నది. ఈ ఆంగ్ల యువకుడు బొంబాయిలో వున్నప్పుడు. 1897లో ప్లేగు జబ్బు సోకిన వారిమధ్య నిర్భయంగా తిరుగుతూ వాళ్లకు సాయం చేశాడు రోగంతో బాధపడుతున్న జనం మధ్య జంకకుండా తిరుగుతూ వాళ్లకు సేవచేసిన అతనికి మృత్యుభయం కలుగలేవు నిర్భయం అతనిరక్తంలో ప్రవేశించింది. జాతి ద్వేషంకాని, రంగుద్వేషం కాని అతడికి లేదు. అతడు స్వతంత్రమైన స్వభావం గల వ్యక్తి సత్యం ఎప్పుడూ అల్పపక్షం అనగా మైనారిటీ పక్షంవైపునే వుంటుందని అతని సమ్మకం నమ్మకంతోనే జోహన్స్ బర్గులో ఆతడు నా దగ్గరికి వచ్చాడు నవ్వుతూ "మీ పక్షం పెద్దదైపోతుంది. అప్పుడు నేను మీకు దూరమైపోవడం ఖాయం మెజారిటీ పక్షం చేతుల్లోపడితే సత్యం కూడా అసత్యమైపోతుంది అందువల్ల నేను అప్పుడూ మీకు దూరమవుతాను" అని అంటూవుండేవాడు. అతడి మాటకు గొప్ప అర్థం వున్నది జోహన్స్‌బర్గు చెందిన ఒక కోటీశ్వరుడు సర్ జార్జిఫెర్రర్‌కు నమ్మకమైన సెక్రటరీగా పని చేసేవాడు. షార్ట్‌హాండు నేర్చుకున్నాడు. మేము ఇంగ్లాండులో వున్నప్పుడు హఠాత్తుగా అక్కడికి వచ్చాడు. ఆయన నివాసగృహాన్ని నేను ఎరుగను మేము ప్రజాకార్యక్రమాలు నిర్వహిస్తూ వుంటాము కనుక మా పేర్లు పత్రికల్లో వస్తూ వుండేవి ఆ