పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

134

ఇంగ్లాండులో ప్రతినిధిబృందం


వందమంది మిత్రులకు విందు ఆహ్వానం పంపించాము వారందరికీ కృతజ్ఞతలు చెప్పడం, వారిదగ్గర సెలవు తీసుకోవడం, ఒక స్థాయీ సమితిని ఏర్పాటు చేయడం ఆ విందు ఏర్పాటుకు లక్ష్యం పద్ధతి ప్రకారమే భోజనానంతరం ఉపన్యాసాలు జరిగాయి. స్థాయీ సమితికూడా ఏర్పడింది ఈ కార్యక్రమంవలన మా ఉద్యమానికి ప్రచారంతో బాటు బలం కూడా లభించింది.

ఈ విధంగా ఆరువారాలు ఇంగ్లాండులో వుండి కార్యక్రమాలు నిర్వహించి, మేము దక్షిణాఫ్రికాకు తిరిగి వచ్చాము మదీరా చేరేసరికి మాకు శ్రీ రిచ్ పంపిన తంతి అందింది. బ్రిటిష్ మంత్రి వర్గం చక్రవర్తికి ట్రాన్స్‌వాల్ అసెంబ్లీ అంగీకరించిన ఏషియాటిక్ ఆక్టును నిరాకరించమని సిఫారసు చేసినట్లు లార్డ్ ఎల్గిన్ ప్రకటించారు " అని ఆతంతిలో వున్నది మాసంతోషానికి అంతు లేకుండా పోయింది మదీరానుంచి కేప్‌టౌను చేరుటకు 14 లేక 15 రోజులు పడతాయి. ఈ రోజుల్ని అమితానందంతో గడిపాము భవిష్యత్తులో మిగతా బాధల్ని తొలగించుటకు ఏమేమి చేయాలో అనేక ఆకాశహర్మ్యాలను వెర్రివాళ్ల వలె నిర్మించాం మేము కట్టుకున్న గాలిమేడలు ఎలా కూలిపోయాయో తరువాత ప్రకరణంలో వివరిస్తాను

ఈ ప్రకరణాన్ని ముగించే ముందు ఒకటి రెండు స్మృతులను యిక్కడ వ్రాయడం అవసరం ఇంగ్లాండులో ఒక నిమిషం సమయాన్ని సైతం మేము వ్యర్థం చేయలేదు. పెద్ద సంఖ్యలో సర్క్యులర్లు తయారుచేయడం, అచ్చు వేయడం, సరిదిద్దడం, వాటిని పంపడం మొదలగు పనులు ఒక్కచేతితో ఎలా జరుగుతాయి? అందుకు బయటివారి సాయం అవసరమైంది డబ్బు ఖర్చు చేస్తే యిట్టి సాయం సామాన్యంగా లభిస్తుంది కాని 40 సంవత్సరాల అనుభవంతో చెబుతున్నాను, వాలంటీర్ల ద్వారా అయితే యిట్టి పనులు విజయవంతం అవుతాయి అదృష్టం వల్ల అట్టి పరిశుద్ధ సహకారం ఇంగ్లాండులో మాకు లభించింది. అక్కడ చదువుకుంటున్న అనేక మంది భారతీయ విద్యార్థులు మాకు అండగా నిలచారు. వారిలో చాలామంది