పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

133


దక్షిణాఫ్రికా వాసి, నా ఆఫీసులో క్లర్కుగా పని చేశారు. యిప్పుడు వారు లండన్‌లో బారిష్టరీ పూర్తి చేస్తూ వున్నారు. ఈ పని చేయాలనే కోరిక కూడా వారికి కలిగింది. దానితో మేము యీ పనికోసం దక్షిణాఫ్రికా బ్రిటిష్ ఇండియన్ కమిటీ అనుపేర ఒక స్థాయీ సమితిని ఏర్పాటు చేయడానికి సాహసించాము ఇంగ్లాండు, తదితర పాశ్చాత్య దేశాలలో మంచి పనుల్ని విందుతో ప్రారంభించే (నాదృష్టిలో అసభ్యకరమైన) విధానం ఒకటి వున్నది. బ్రిటిష్ ప్రధానమంత్రి ప్రతి సంవత్సరం నవంబరు 9వ తేదీన మెన్షన్ హౌస్ అని పేరుగల వ్యాపారస్థుల ఒక పెద్ద కేంద్రంలో ప్రపంచాన్నంతటిని ఆకర్షించగల ఒక ఉపన్యాసం యిస్తూ వుంటాడు. తద్వారా సంవత్సరం పొడుగునా తాను చేయబోయే కార్యక్రమాల రూపురేఖల్ని వివరిస్తాడు భవిష్యత్తును గురించిన తన అంచనాలను ప్రకటిస్తాడు. లండన్ నగర లార్డ్ మేయరు బ్రిటిష్ మంత్రి వర్గ సభ్యులకు, తదితరులకు ఆ భవనంలో పెద్ద విందు ఏర్పాటు చేస్తాడు. విందు పూర్తికాగానే మద్యం సీసాలు బిర బిరా బైటికి వస్తాయి. యజమానుల, అతిధుల ఆరోగ్యాభివృద్ధి పేరట అంతా మద్యం తెగ తాగుతారు. ఈ కార్యక్రమం శుభ, అశుభ (పాఠకులు తమకు యిష్టమైన శబ్దాన్ని గ్రహించవచ్చు) తతంగం బాగా సాగుతున్నప్పుడు కొందరు ఉపన్యాసాలిస్తూ వుంటారు. అందు బ్రిటిష్ సామ్రాజ్య మంత్రి వర్గంటోస్టు (ఆరోగ్యాభివృద్ధి కోసం యిచ్చే ఆశీస్సు) కూడా చేరుస్తారు. అందుకు సమాధానంగా బ్రిటిష్ ప్రధానమంత్రిగారి ఉపన్యాసం సాగుతుంది ప్రజాకార్యక్రమాల్లో యిట్టి విందుల ఏర్పాటు జరిపినట్లే, ఏ గొప్ప వ్యక్తితో మాట్లాడలన్నా కూడా యిదే విధంగా విందుకు ఆహ్వానిస్తారు. భోజనం చేస్తున్నప్పుడో, లేక భోజనం అయిపోయిన తరువాతనో అసలు సంభాషణను ప్రారంభిస్తారు. మేము కూడా అనేక సార్లు యీ విధానాన్ని పాటించవలసి వచ్చింది. అయితే పాఠకులు ఒక్క విషయం తెలుసుకోవాలి భోజనాల సమయంలో త్రాగకూడని పానీయం మేము త్రాగలేదు. తినకూడని (మాంసం) పదార్థం మేము తిన లేదు. ఈ పద్ధతి ప్రకారం మేము ఒకసారి మధ్యాహ్నభోజనానికి మమ్ము సమర్ధించిన వారందరినీ ఆహ్వానిందాం ఒక