పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

131


చేస్తున్నప్పుడు ఎక్కడా ఆగవలసిన అవసరం వారికి వుండదు. పత్రికలకు బాబులు వ్రాయడంలో కూడా దిట్ట ట్రాన్స్‌వాల్ బ్రిటిష్ అసోసియేషన్ మెంబరు చాలాకాలాన్నుంచి ప్రజాకార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. హిందుస్తానీ భాషకూడా బాగా మాట్లాడగలరు. ఒకమలై స్త్రీని వివాహం చేసుకున్నారు చాలామంది బిడ్డలు కలిగారు. మేమిద్దరం ఇంగ్లాండు చేరుకొని పని ప్రారంభించాము భారతమంత్రికి అందజేయవలసిన అర్జీని మేము ఓడలోనే తయారుచేశాము ఇంగ్లాండు చేరి దాన్ని అచ్చువేయించాము అప్పుడు అధినివేశ రాజ్యాల మంత్రిగా లార్డ్ ఎల్గిన్ వున్నారు. భారతమంత్రి లార్డ్ మోర్లే మేమిద్దరం ముందు దాదా భాయి నౌరాజీగారిని కలిశాము తరువాత వారి ద్వారా భారత జాతీయ కాంగ్రెస్ బ్రిటిష్ కమిటీ వారిని కలిశాము. వారికి మాకేసు వివరం చెప్పాము అన్ని పార్టీల సహకారంతో పని చేస్తామని వారికి చెప్పాము దాదాభాయి నౌరాజీ కూడా మాకు యిట్టి సలహాయే యిచ్చారు. బ్రిటిష్ కమిటీకి మా అభిప్రాయం నచ్చింది. మేము సర్ మంచెర్టీ భావన్‌గరీ గారిని కలిశాము వారు కూడా మాకు ఎంతో సహాయం చేశారు. వారు. దాదాభాయినౌరోజీ గారు యిద్దరూ మీరు విభిన్న పార్టీల మెంబర్లను కూడా వెంట బెట్టుకొని లార్డ్ ఎల్గిన్‌ను కలవమని చెప్పి, ఒక ఆంగ్లో ఇండియన్ నాయకత్వాన వెళ్లి కలవడం మంచిదని కూడా చెప్పారు. సర్ మంచేర్జీ కొన్ని పేర్లుకూడా చెప్పారు. వారిలో సర్‌లెపట్ గ్రిఫిన్ గారి పేరు కూడా వున్నది. యిక్కడ పాఠకులకు ఒక విషయం చెప్పడం అవసరం యిప్పుడు సర్ విలియం విల్సన్ హంటర్ జీవించి లేరు వారు జీవించి యుంటే దక్షిణాఫ్రికా యందలి భారతీయుల స్థితిగతులను గురించి బాగా తెలిసిన వారు గనుక వారే ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించియుండే వారు. అలా కాకపోతే వారే లార్డ్ సభకు చెందిన మంచి గట్టి నాయకుణ్ణి ప్రతినిధి బృందానికి నాయకునిగా నియమించి యుండేవారు మేమిద్దరం సర్‌లెపల్ గ్రిఫిన్‌గారిని కలిశాము వారు భారతదేశంలో నడుస్తున్న రాజకీయ ఉద్యమానికి వ్యతిరేకులు అయితే దక్షిణాఫ్రికాలో జరుగుతున్న మా వ్యవహారాల యెడ ఆయనకు అభిరుచి కలిగింది. అందువల్ల