పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

130

ఇంగ్లాండులో ప్రతినిధిబృందం


సంతకం చేయడానికి వెనుకంజ వేయడం నేను గమనించాను. నిజానికి ఒకసారి ప్రతిజ్ఞచేస్తే దానికి కట్టుబడి వుండాలి. కాని బాగా యోచించి ప్రతిజ్ఞచేసిన వాళ్లే సమయం వచ్చినప్పుడు వెనుకంజవేయడం, మౌఖికంగా చేసిన ప్రతిజ్ఞా పత్రం మీద లిఖితరూపంలో సంతకం చేయవలసి వచ్చినప్పుడు కొందరు జారుకోవడం కూడా జరిగింది. మేము అనుకున్నంత ధనం ఖర్చులకోసం అందింది అయితే ప్రతినిధిబృంద సభ్యుల్ని ఎన్నుకోవలసి వచ్చినప్పుడు పెద్ద యిబ్బంది కలిగింది. నా పేరు అందులో వున్నది. నా వెంటయింకా ఎవరెవరు రావాలి" నిర్ణయించుటకు ఎక్కువ సమయం పట్టింది. చర్చలతో చాలా రాత్రిళ్లు గడిచాయి. సంస్థల్లోను, సంఘాల్లోనూ వుండే చెడు అంతా మాకు బోధపడింది. మీరు ఒక్కరే వెళితే సంతోషిస్తామని కొందరన్నారు. అందుకు నేను అంగీకరించలేదు దక్షిణాఫ్రికాలో హిందూ ముస్లిముల సమస్య లేదు. కాని యిద్దరికీ వైషమ్యం లేదని పూర్తిగా చెప్పలేము. అయితే అక్కడ నెలకొనియున్న విచిత్రమైన పరిస్థితులవల్ల మతవైషమ్యం నిషాలేదని చెప్పవచ్చు. అక్కడి భారతీయులందరూ అరమరికలు లేకుండా పరిశుద్ధ హృదయంతో జాతికే సేవ చేశారు. జాతికి నిష్ఠ, నిజాయితీలతో మార్గం చూపించారు. నాతో బాటు యిద్దరు సభ్యులు వస్తే చాలనీ, ఒక మహమ్మదీయుడు వుంటే మంచిదని చెప్పాను వెంటనే కొందరు మీరు జాతికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అందువల్ల మీతోబాటు ఒక హిందువు కూడా వుంటే మంచిదని అన్నారు ప్రతినిధి బృందంలో ఒక కొంకణి, ఒక మేమన్ ముస్లిం వుండాలని కొందరు సూచించారు. హిందువుల్లో ఒక పాటీదారు, ఒకఅనావిల్ తెగ వారు వుండాలని కొందరి సలహా అయితే చివరికి అంతా విషయాన్ని అర్థం చేసుకోని నాతో బాటు శ్రీ హజీ వజీరలీ గారిని పంపడానికి ఏక గ్రీవంగా నిర్నయించారు

శ్రీ హజీ వజీరలీ సగం మలైవాసి ఆయన తండ్రి భారతీయ ముస్లిం, తల్లిమలై దేశస్థురాలు వారి మాతృభాష డచ్ ఇంగ్లీషుకూడా నేర్చుకున్నారు కనుక డచ్, ఇంగ్లీషు భాషలు బాగా మాట్లాడగలరు ఇంగ్లీషులో ఉపన్యాసం