పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

129


క్రిందవున్న బాధ్యత కలిగిన చిన్న ప్రభుత్వం అంటే చట్టరీత్యాను, పరిపాలన దృష్ట్యాను బ్రిటిష్ ప్రభుత్వానికి లోబడియున్న రాజ్యమన్నమాట అందువల్లనే అధినివేశ రాజ్య అసెంబ్లీ ప్యాసు చేసిన చట్టాల్ని సైతం బ్రిటిష్ సామ్రాజ్య చక్రవర్తి బ్రిటిష్ రాజ్యాంగం రీత్యా సరికాదని తోస్తే నిరాకరించవచ్చు. కాని బాధ్యత కలిగిన పెద్ద దేశాలైతే అక్కడి అసెంబ్లీ ప్యాసుచేసిన చట్టాన్ని చక్రవర్తి అంగీకరించాల్సిందే ట్రాన్స్‌వాల్ చట్టం చక్రవర్తి సంతకం కోసం ఇంగ్లాండు వెళ్లుతుంది. కనుక ఇంగ్లాండుకు ప్రతినిధి బృందం వెళ్లాలని అంతా భావించారు. అయితే భారత జాతిప్రతినిధిబృందం ఇంగ్లాండుకు వెళ్లితే, అది తన బాధ్యతను పూర్తిగా నిర్వహించాలికదా! ఇక యీ బాధ్యత నాపైన పడింది. నేను ఆసోసియేషన్‌కు మూడు సలహాలు ఇచ్చాను

(1) మనం యూదుల నాటకశాలలో అందరిచేత ప్రతిజ్ఞ చేయించాము అయినా తిరిగి ప్రముఖ భారతీయుల చేత వ్యక్తి గత ప్రతిజ్ఞల్ని తీసుకోవాలి దానివల్ల వాళ్లకు కలిగే యిబ్బందులు వాళ్ల బలహీనతలు ఏమిటో మనకు తెలుస్తాయి. ఇలా చేస్తే మనం నిర్బయంగా ఇంగ్లాండు వెళ్లగలుతాము అధినివేశాల రాజ్య మంత్రికి, భారతమంత్రికి యిక్కడి మన పరిస్థితుల్ని గురించి నిర్భయంగా చెప్పగలుగుతాము

(2) భారత ప్రతినిధి బృంద సభ్యులకు అయ్యే ఖర్చులకోసం ధనం సమకూర్చుకోవాలి

(3) ప్రతినిధి బృందంలో తక్కువమంది సభ్యులు వుండాలి

ఈ మూడువ సూచన చాలా ముఖ్యమైనది. ఎక్కువమంది జనం వెళ్లితే ఎక్కువ పనిజరుగుతుందని, ఆ విధంగా వెళ్లడం వల్ల వ్యక్తిగతంగా గౌరవం పెరుగుతుందని సామాన్యంగా జనం భావిస్తూ వుంటారు. అది తప్పని, జాతికి సేవ చేయడానికే గాని సన్మానం కోసం కాదని, తక్కువమంది వెళ్లితే ఖర్చులు కూడా తగ్గుతాయని స్పష్టంగా చెప్పాను నా యీ మూడు సలహాల్ని అంతా అంగీకరించారు. ప్రజల సంతకాలు మళ్లీ తీసుకోవడం ప్రారంభించాము చాలా మంది ప్రతిజ్ఞ పత్రాల మీద సంతకాలు చేశారు. నాటకశాలలో మౌఖికంగా ప్రతిజ్ఞచేసిన వారిలో కొందరు లిఖిత ప్రతిజ్ఞ పత్రం మీద