పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

121


జరిపారు. ప్రతిసభలోను జనం చేత ప్రతిజ్ఞ చేయించారు. ఇండియన్ ఒపీనియన్ పత్రికలలో ఖూనీ (రక్తపు) చట్టం చర్చకు ముఖ్య విషయం అయిపోయింది

రెండో వైపున స్థానిక ప్రభుత్వాన్ని కలియుటకు ఏర్పాట్లు జరిగాయి. ఒక ప్రతినిధి బృందం అధినివేశ రాజ్యాల మంత్రి శ్రీ. డంకల్‌ను కలుసుకునేందకు వెళ్లింది. మిగతా విషయాలతోబాటు జాతి తీసుకున్న ప్రతిజ్ఞను గురించి కూడా వారికి చెప్పారు, ప్రతినిధిబృందంలో ఒక సభ్యుడైన సేర్ హాజీహాబీబ్ "ఎవరైనా ప్రభుత్వాధికారి నాభార్య దగ్గరికి వచ్చి వ్రేళ్ల ముద్రలు వేయమని అంటే వాణ్ణి వెంటనే కాల్చి చంపివేస్తాను కాల్చుకొని నేను చస్తాను" అని అన్నాడు. కొద్దిసేపు మంత్రి హబీబ్ ముఖం వంక చూచాడు. అసలు యీ చట్టాన్ని స్త్రీలకు వర్తింపచేయాలా వద్దా అని ప్రభుత్వం ఆలోచిస్తున్నది యిప్పుడే నేను మాట యిస్తున్నాను స్త్రీలకు సంబంధించినంత వరకు చట్ట నింబంధనల్ని రద్దుచేస్తాము ఈ విషయమై మీ భావాల్ని ప్రభుత్వం అర్థం చేసుకున్నది మీ భావాన్ని గౌరవించితీరుతాం మిగతా నిబంధనల విషయమై ప్రభుత్వం గట్టిగా వున్నది. వుంటుందికూడా జనరల్ బోధా జాగ్రత్తగా యోచించి యీ బిల్లును అంగీకరించమని కోరుతున్నారు. తెల్లవాళ్ల కోసం ప్రభుత్వం యీ చట్టం అవసరమని భావిస్తున్నది. నిబంధనల విషయంలో మీరేమైన సలహాలు యివ్వదలిస్తే యివ్వండి మీకు మంచిది" అని చెప్పాడు. ప్రతినిధి బృంద సభ్యులు చట్టాన్ని వ్యతిరేకిస్తూ అనేక విషయాలు మంత్రి ఎదుట పేర్కొన్నారు. వాటన్నింటిని గురించి నేను యిక్కడ వ్రాయడం లేదు. గత ప్రకరణాల్లో వాటి వివరాలు వ్రాశాను స్త్రీలను చట్టాన్నుంచి మినహాయించి నందుకు కృతజ్ఞులం కాని చట్టాన్ని మేమెవ్వరం అంగీకరించేది లేదని చెప్పి అంతావచ్చి వేశారు. భారతస్త్రీల మినహాయింపును గురించి చర్చ ప్రారంభమైంది పోరాటంవల్ల కలిగిన శుభపరణామమని కొందరన్నారు కాని ప్రభుత్వం మాత్రం పోరాటానికి వెరిచి మినహాయించలేదు. స్వతంత్రంగా యోచించి యీ నిర్ణయంగైకొన్నదని ప్రకటించింది. కాకతీయంగా యిది