పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

117


గూడార్థం జనానికి చెప్పాలని నాకు అనిపించింది. అర్థంచేసుకొని ప్రతిజ్ఞచేయమని అందరికీ చెప్పాలని అనిపించింది. అందరము అట్టి ప్రతిజ్ఞచేయలేకపోతే భారత జాతి, యింకా చివరిమెట్టు చేరలేదని భావించవలసి వస్తుంది కదూ! నేను సభాధ్యక్షుణ్ణి హబీబ్ ప్రసంగంమీద మాట్లాడుటకు అనుమతికోరాను. ఆయన అనుమతి యిచ్చాడు. లేచి నిలబడి మాట్లాడాను జ్ఞాపకం వున్నంతవరకు వివరం క్రింద తెలుపుతున్నాను

"ఇప్పటివరకు మనం అనేక తీర్మానాలు అంగీకరించాం కాని యివాళ అంగీకరించబోయే తీర్మానానికి గతంలో అంగీకరించిన తీర్మానాలకు విధానంలో పెద్ద తేడా వున్నది. దీన్ని అంతా జాగ్రత్తగా గమనించాలి. ఈ తీర్మానం ఎంతో గంభీరంగా వున్నది. దీన్ని సంపూర్తిగా అమలుపరిస్తేనే దక్షిణాఫ్రికాలో మన వ్యక్తిత్వం లేక మన ఉనికి నిలచి వుంటుంది. మన మిత్రుడు తీర్మానం చేయవలసిన విధానాన్ని క్రొత్త పద్ధతిలో సూచించాడు. నిజానికి నేను యీ పద్ధతిలో తీర్మానం అంగీకరించాలనే భావంతో సభకు రాలేదు. ఈ శ్రేయస్సంతా సేర్ హాజీహబీబ్‌కు లభించాలి దీని బాధ్యత కూడా వారి మీద వుంచాలి యిందుకు వారిని నేను అభినందిస్తున్నాను వారి సూచన నాకు బాగా నచ్చింది. వారి సూచనను మీరంతా అంగీకరిస్తే తీర్మానం అమలుచేయుటకు మీరంతా బాధ్యత వహించాలి ఆ బాధ్యతను మీరంతా అర్థం చేసుకోవాలి జాతిసేవకుడుగా, కార్యకర్తగా ఆబాధ్యతను మీకు తెలియజేస్తున్నాను

మనమంతా ఒకే సృష్టికర్తను విశ్వసిస్తున్నాము. మహమ్మదీయులు అతణ్ణి ఖుధాఅని అంటున్నారు. హిందువులు ఈశ్వరుడు అని అంటున్నారు ఈశ్వరుణ్ణి సాక్షిగా వుంచి మనం ప్రతిజ్ఞ చేస్తే అది సామాన్యమైన విషయంకాదు. ఈ విధంగా ప్రతిజ్ఞచేసి దాన్ని ఆచరణలో పెట్టక పోతే జాతికి. ప్రపంచానికి. ఈశ్వరునికి ద్రోహం చేసిన వారమవుతాము ఆషామాషీగా ప్రతిజ్ఞ చేసిన దాన్ని అమలు చేయనివాడు జాతి, సమాజం, ఈశ్వరుని ముందు అపరాధి అవుతాడు. సత్తురూపాయికి విలువలేకపోగా దాన్ని దగ్గర దాచినవాడు శిక్షకూడా పొందే అవకాశం అట్లే అబద్దపు ప్రతిజ్ఞ చేసేవాడికి