పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

116

సత్యాగ్రహ పుట్టుక


ముందు తలవంచడం నామర్దాపని అందువల్ల నేను ఖుదా పేరట ప్రమాణం చేసిచెబుతున్నాను. ఈ చట్టం ముందు నేను తలవంచను ఈ సభకు వచ్చిన వారంతా ఖుదా పేరిట ఒట్టుపెట్టుకొని యీ తీర్మానాన్ని అంగీకరించాలి " అని ఉద్బోధించాడు

చాలామంది తీర్మానాన్ని సమర్థిస్తూ తీవ్రంగా మాట్లాడారు. సేఠ్‌హాజీహబీజ్ మాట్లాడుతూ మాట్లాడుతూ ఖుదా పేరట ఒట్టు అనే సరికి నేను ఉలిక్కిపడి జాగ్రత్త పడ్డాను. అప్పుడు నాకు నా బాధ్యత, భారత జాతి బాధ్యత ఏమిటో అర్థమైంది. యిప్పటివరకు భారతీయులు చాలా తీర్మానాలు చేశారు అనుభవం గడించిన తరువాత వాటిలో మార్పులు కూడా చేశారు తీర్మానాలు అంగీకరించిన వాళ్లలో చాలామంది శ్రద్ధ వహించలేరు యివన్నీ ప్రపంచంలో సామాన్యంగా జరుగుతూ వుంటాయి. అయితే యిలాంటి తీర్మానాలు వచ్చినప్పుడు ఎవ్వరూ దేవునిపేరు స్మరించరు. నిజానికి సామాన్యంగా మనం అంగీకరించే తీర్మానాలకు, భగవంతునిపేరిట అంగీకరించే తీర్మానాలకు తేడా వుండకూడదు. బుద్ధిమంతుడు ఆలోచించి ఒక నిర్ణయం చేసినప్పుడు దానిమీద నిలబడుతాడు జారడు దేవుణ్ణి సాక్షిగా పెట్టి చేసిన ప్రతిజ్ఞకు సామాన్యంగా అంగీకరించి చేసే ప్రతిజ్ఞకు పెద్ద తేడా వుండదు అయితే ప్రపంచం సూక్ష్మ సిద్ధాంతం మీద ఆధారపడి నడవదుకదా! అది యీ రెండిటీకి మధ్య పెద్ద తేడావున్నా దాని నమ్ముతుంది. భగవంతుని పేరిట ప్రతిజ్ఞచేసి జారిపోయినవాణ్ణి ప్రపంచం హర్షించదు. దీని ప్రభావం మనిషి మనస్సుపై అమితంగా పడుతుంది కోర్టుల్లో ప్రమాణం చేసి ఆబద్దం చెబితే అతడికి శిక్ష పడుతుంది

ఇటువంటి ఎన్నోభావాలు నా బుర్రలో మెసిలాయి ఎన్నో అనుభవాలు పొందాను ప్రతిజ్ఞల తీయని ఫలితాన్ని కూడా జీవితంలో అనుభవించాను అట్టి నేను దేవుని పేరు వచ్చేసరికి ఉలిక్కిపడ్డాను. అందువల్ల కలిగే పరిణామాల్ని ఉహించుకున్నాను నాకు ఉత్సాహం, ఆవేశం రెండూ కలిగాయి నేను ప్రతిజ్ఞ చేద్దామని యితరుల చేత చేయిద్దామని ఆసభకు వెళ్లలేదు కాని సేర్ చేసిన సూచన నాకు నచ్చింది. అయితే అతడి మాటల్లో గల