పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

115


12

సత్యాగ్రహ పుట్టుక

యూదుల ఆనాటకశాలలో 1906 సెప్టెంబరు 11వ తేదిన భారతీయుల సమావేశం జరిగింది. ట్రాన్స్‌వాల్ రాజ్యపు పలుపట్టణాలనుంచి ప్రతినిధుల్ని ఆహ్వానించాము. అయితే అప్పుడు తయారుచేసిన తీర్మానాల భావం నేనుకూడా పూర్తిగా తెలుసుకోలేకపోయానని చెప్పవచ్చు. ఆతీర్మానాల్ని అంగీకరిస్తే కలిగే పరిణామాల్ని కూడా నేను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాను సభ జరిగింది. నాటకశాలలో అడుగుపెట్టడానికి చోటుదొరక లేదు. అంతజనం వచ్చారు. ఏదోక్రొత్త పనిచేయాలి, ఏదోక్రొత్త పనిజరుగుతుంది అనే భావం అందరి ముఖాన స్పష్టంగా నాకు కనబడింది. ట్రాన్స్‌వాల్ బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్ అధ్యక్షలు శ్రీ అబ్దుల్‌గినీ సభకు అధ్యక్షత వహించారు ట్రాన్స్‌వాల్‌లో నివసిస్తున్న భారతీయుల్లో వారు పాతవారు. వారు మహమద్ కాసింకమరుద్దీన్ అనుపేరుగలు ప్రసిద్ధవ్యాపారికి భాగస్వామి జోహన్స్‌బర్గ్‌లో గలవారి శాఖకు మేనేజరు చాలా తీర్మానాలు ప్యాసయ్యాయి కాని నిజమైన తీర్మానం ఒక్కటే "ఎన్ని ప్రయత్నాలుచేసినా యీ బిల్లు అసెంబ్లీలో ప్యాసైతే భారతీయులు ఓటమిని అంగీకరించకూడదు. అందువల్ల కలిగే కష్టనష్టాల్ని ధైర్యసాహసంతో ఎదుర్కొవాలి " ఇది అతీర్మాన సారాంశం

ఈ తీర్మానాన్ని నేను సభకు వినిపించి దాన్ని గురించి వివరించాను సభశాంతితో నా ప్రసంగం విన్నది. హిందీలోను, గుజరాతీలోను సభాకార్యక్రమమంతా నడిచింది. కనుక భారతీయులకు అర్థం కాలేదనుటకు వీలులేదు. హిందీ, గుజరాతీ రాని తెలుగు, తమిళభాషీయులకు ఆభాషలు తెలిసిన వారు పూర్తిగా వివరించి చెప్పారు. నియమప్రకారం తీర్మానం సభలో ప్రవేశపెట్టాము అనేక మంది వక్తలు ఆ తీర్మానాన్ని సమర్థించారు. వారిలో సేఠ్ హాజీహబీబ్ అనువారు ఒకరు వారు దక్షిణాఫ్రికాలో చాలకాలాన్నుంచి వుంటున్నారు. వారి ప్రసంగం చాలా తీవ్రంగా సాగింది. ఆవేశంతో పూగిపోతూ ఆయన "అల్లా సాక్షిగా మనం యీ తీర్మానాన్ని అంగీకరించాలి యీ బిల్లు