పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

114

సజ్జనత్వానికి ప్రతీకారం


"రెండో రోజున భారతీయ పెద్దలందరినీ పిలిపించి యీ బిల్లు విషయం తెలియజేశాను అంతావిన్న మీదట నాపైపడిన ప్రభావమే వారిపైన కూడా పడింది. ఒకడు లేచి ఆవేశంగా నా భార్యను వేలి ముద్రలువేయమని ఎవడైనా అడిగితే తక్షణంవాణ్ణి కాల్చిపారేస్తాను తరువాత నేవేమైనా సరే అని ఆరిచాడు. అతణ్ణి శాంత పరిచాను

నేను అందరికీ స్పష్టంగా యీ బిల్లు ప్యాసైందీ అంటే యిక్కడ భారతీయులంతా పైగుడ్డలతో తిరుగుముఖం పట్టవలసిందే ట్రాన్స్‌వాల్‌లో యీ బిల్లు అమలులోకి వస్తే దక్షిణాఫ్రికా యందలి అన్ని రాష్ట్రాల్లో వచ్చి తీరుతుంది. అంటే భారతీయుల్ని వెళ్లగొట్టడానికి తెల్లవాళ్లు జరుపుతున్న కుట్రయిది. దీన్ని సమూలంగా నాశనం చేయాలి చేసితీరాలి "అని చెప్పివేశాను. యిది మనకే కాదు మన భారతదేశానికే అవమానకరమైన విషయం యిట్టి బిల్లులు మనకు వర్తించకూడదు కోపం తెచ్చుకున్నంతమాత్రాన, ఆవేశపడినంత మాత్రాన యీ బిల్లు ఆగదు. మనం ఒక్కటిగా నిలబడాలి అన్నివిధాల యీ బిల్లును వ్యతిరేకించాలి భగవంతుడు మనల్ని తప్పక రక్షిస్తాడు" అని కూడా చెప్పాను జనానికి ముంచుకువస్తున్న ప్రమాదం బోధపడింది. దీనికోసం చర్చించి నిర్ణయించడానికి యూదుల నాటకశాలను ఎన్నుకొని అక్కడ సభజరుపుటకు నిర్ణయం చేశాం

ఇప్పుడు యీబిల్లును "ఖూనీ చట్టం" అని ఎందుకు అన్నానో పాఠకులకు బోధపడిందికదూ? ఈ ప్రకరణానికి పెట్టిన ఖూనీ అను విశేషణం నాది కాదు ఈ చట్టానికి దక్షిణాఫ్రికాలో ఖూనీ శబ్దం తానంతట అదే ప్రచారంలోకి వచ్చింది.