పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

103


దోషాలుగా భావించ బడుతున్నాయని అంటున్నారు. నిజానికి భారతీయులు నిరాడంబరత. ఎక్కువ కాలం కాయకష్టంచేయగలశక్తి సామర్థ్యాలు. మతవ్యయం, పారలౌకిక దృక్పధం, సహనశక్తి, మొదలుగా గల తమగుణాలవల్లనే అప్రియులై ద్వేషానికి గురి అయ్యారు. పాశ్చాత్యప్రజలు సాహసులు, జీవనానికి అవరసరమైన వాటిని పొందాలనే కోరిక కలవారు ఆహారపానీయాల యెడ మక్కువ కలవారు కాయకష్టం తగ్గించుకోవాలనే కోరిక కలవారు ఎగిరిపోవాలనే కాంక్ష కలవారు. అందువల్ల తూర్పు నాగరికతకు చెందిన జనం దక్షిణాఫ్రీఖాలో పెరిగిపోతే తాము యిక్కడి నుంచి పారిపోవలసి వస్తుందని భయడుతున్నారు. అది ఆత్మహత్యాసదృశం అందుకు పాశ్చాత్యులు ఎట్టిస్థితిలోను సిద్ధంగా లేరు. వారిని సమర్థించే నాయకులు, మేధావులు యిట్టి ప్రమాదంలో వారిని పడనీయరు "

పైన నేను తెలిపిన వివరం దక్షిణాఫ్రికాకుకు చెందిన తెల్ల జాతివారు, మంచివారు, మంచినడత కలవారు వెల్లడించిన అభిప్రాయాల సారమే వాళ్లు తెలిపిన యీ వాదనలు తత్వజ్ఞానంతో కలిసిన పాఖండత్వానికి నిదర్శనాలని నా అభిప్రాయం. అయితే వారి వాదనలో నిజంలేదని నేను అనను. వ్యావహారిక దృష్టితోను, తాత్కాలికమైన సంకుచిత స్వార్థదృష్టితోను అందు సత్యం వున్నది కాని తత్వజ్ఞానం దృష్ట్యా అంతా అబద్దం నాటకం తటస్థంగా పుండే ఏ బుద్ధిమంతుడూ తెల్లవాళ్లు తెలిపిన తర్కాన్ని అంగీకరించలేడని నాఅభిప్రాయం ఏయోచనా పరుడు తమ నాగరికతను యీ విధమైన విపత్కర పరిస్థితిలో వున్నట్లు చిత్రించడు నాకు తెలిసినంతవరకు పాశ్చాత్యదేశాలకు సంబంధించిన ఒక్క తత్వజ్ఞాని కూడా వాళ్ల తర్కాన్ని అంగీకరించడు. పాశ్చాత్య నాగిరకతననుసరించే ప్రజలు స్వేచ్ఛగా తూర్పు ప్రజలచేరువకు వస్తారనిగాని, అలస్వస్తే పాశ్చాత్య నాగరకతా వెల్లువలో తూర్పునాగరికత ఇసుకలా కరిగి కొట్టుకుపోతుందనిగాని తూర్పునాగరికతకు చెందిన ఏతత్వజ్ఞానీ భయపడడు తూర్పుసభ్యాతావిశేషాల్ని నేను గ్రహించాను ఆది పాశ్చాత్య సభ్యతకు స్వాగతం పలుకుతుంది పాశ్చాత్య సభ్యతవల్లతనకు ముప్పు కలుగుతుందని భయపడదు. యిందుకు విరుద్దంగా ఉదాహరణలు