పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

102

యుద్ధం తరువాత


ఇట్టి వాదనలు తెల్లజాతి మంత్రిమండలి సభ్యులపైన తెల్లజాతి జనంపైన బాగా పనిచేశాయి. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించడమే వాళ్ల లక్ష్యం యిందుకు భారతీయులు తోడైతే తమ లక్ష్యం ఎలా నెరవేరుతుంది? చక్షిణాఫ్రికా యందలి మేధావులకు వ్యాపారం, ధన సంపాదన అంటే నచ్చదు. కనుక దీనితో బాటు కొంత తత్వజ్ఞానాన్ని కూడా వాళ్లు జోడించారు అన్యాయం చేయదలిచి, దానికి అనువైన వాదనలు కూడా వెతికి బయటికి తీశారు. జనరల్ స్మట్స్, తదితర తెల్లజాతి వారు పేర్కొన్నవాదనల సారాంశం యిక్కడ తెలుపుతున్నాను

దక్షిణాఫ్రికా పాశ్యాత్య సభ్యతకు ప్రతినిధికేంద్రం భారతదేశం తూర్పు సభ్యతకు కేంద్రం. ఈ రెండు సభ్యతలకు సఖ్యత. కుదురుతుందని తత్వజ్ఞానులు కాని, యోచనా పరులు గానీ అంగీకరించరు. అందువల్ల రెండు విరుద్ద నాగకరికతల ప్రతినిధులు కొద్ది సంఖ్యలో కలిసినా ప్రమాదం తప్పదు. రెండింటికి సంఘర్షణ తప్పదు. పాశ్చాత్యదేశాలు నిరాడంబరతకు వ్యతిరేకం తూర్పుప్రజలు నిరాడంబరత్వానికి జీవితంలో ప్రాధాన్యం యిస్తారు అట్టిస్థితిలో యీరెండు నాగరికతలు కలవడం సాధ్యమా? అయితే యీరెండు నాగరికతల్లో ఏది శ్రేష్ఠమైనది అనువిషయం రాజకీయజ్ఞుల విషయం కాదు. పాశ్చాత్య సభ్యత శ్రేష్ఠమైనదా కాదా అని పాశ్చాత్యప్రజలు ఆలోచించడం లేదు. దాన్ని అనుసరించడమే మంచిదని వారందరి నిర్ణయం పాశ్చాత్య నాగకరికతను రక్షించుకోవడంకోసం పాశ్చాత్యులు ఎంతో కృషిచేశారు రక్తపుటేరులు పారించారు. ఎన్నో కష్టాలు సహించారు. అందువల్ల పాశ్చాత్యులకు మరోమార్గం కనబడటంలేదు. యీ దృష్ట్యా దక్షిణాఫ్రికాలో తెల్లవారికి, భారతీయులకు జరుగుతున్న ఘర్షణ వ్యాపారానికి, డబ్బు సంపాదనకు, రాగద్వేషాలకు సంబంధించినది కాదు రంగుభేదానికి సంబంధించింది అసలే కాదు. వాస్తవానికి యిది ఆత్మ రక్షణకోసం, నాగరికతా రక్షణ కోసం తమకు సహజంగా లభించిన అధికారాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం తమ కర్తవ్యపాలన కోసం జరుగుతున్న ఘర్షణ కొంతమంది వక్తలు భారతీయుల దోషాల్ని ఎత్తిచూపిస్తున్నారు. కొందరు భారతీయుల సుగుణాలే దక్షణిఫ్రికాలో