పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

100

యుద్ధం తరువాత


అంగీకరించినా, నేటాలునందలి ఓటింగ్ హక్కును అంగీకరించే అధికారి, భారతీయుల పేర్లుకూడా ఓటర్ల లిష్టులో నమోదుచేస్తే అతడు చట్టవిరుద్దంగా నిర్ణయంగైకొన్నాడని అనుటకు వీలులేదు. సామాన్యంగా ప్రజల అధికారాలకు అనుకూలంగా ప్రజాభిప్రాయం వుంటుంది. అందువల్ల ఆ అధికారి ఆ చట్టప్రకారం భారతీయులకు, తదితరులకు కూడా ఓటింగుహక్కు యివ్వవచ్చు. కాలంగడిచిన కొద్దీ నేటాల్ ప్రభుత్వానికి భారతీయుల యెడల తేలికభావం తగ్గిపోయిందనుకోండి, భారతీయుల్ని వ్యతిరేకించ వలసిన అవసరంలేదనుకోండి. అప్పుడు చట్టాల్లో ఎట్టి మార్పు చేయవలసిన అవసరం వుండదు. భారతీయుల పేర్లు ఓటర్ల లిస్టులో చేర్చవచ్చు సర్వులకు వర్తించే చట్టవిశేషం యిదే గతప్రకరణాల్లో నేను వివరించిన దక్షిణాఫ్రికాలో ప్యాసు చేయబడిన చట్టాల నుంచి కూడా యిట్టి ఉదాహరణులు యివ్వవచ్చు. అందువల్ల ఏ ప్రభుత్వమైనాసరే, ఒక పక్షానికి వర్తించేచట్టాలు చేయకుండా, సర్వులకూ వర్తించే విధంగా చట్టాలు చేయాలి అదే ఉత్తమ విధానం ఒకసారి చట్టాన్ని అంగీకరించిన తరువాత దాన్ని మార్చాలంటే అనేక ఇబ్బందులు ఎదురువుతాయి చైతన్యంతో కూడిన ప్రజాభిప్రాయం ఏర్పడినప్పుడే చేసిన చట్టాలు రద్దు చేయడమో. లేక అందుమార్పులుచేయడమో తేలిక అవుతుంది. ప్రజాస్వామ్యవ్యవస్థ ప్రకారం నడిచే పరిపాలనా విధానంలో మందు చీటికి మాటికి చట్టాలు రద్దుచేడం, లేక చేసిన చట్టాల్లో మార్పులు తేవడం మంచి పద్దతి కాదు. అది సువ్యవస్థకాదు

ఇక మనం ట్రాన్స్‌వాల్ నందలి ఏషియాటిక్ చట్టాల్లో నిండియున్న విషాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు. ఆచట్టాలన్నీ ఒక పక్షాన్ని దృష్టియందుంచుకొని చేసినవే ఆచట్టాల ప్రకారం ఆసియావాసులు అక్కడ ఓటు వేయడానికి వీలులేదు. ప్రభుత్వం ప్రత్యేకించి నిర్ణయించినచోటదప్ప, మరో చోట వాళ్లు నివేశన స్థలం కొనుక్కొనుటకు వీలులేదు. అట్టిచట్టాలు రద్దుకానంత వరకు అధికారులు భారతీయులకు ఏ సాయమూచేయలేరు అవి సర్వులకు వర్తించే చట్టాలు కావు కనుకనే లార్డ్‌మిల్నర్ నియమించిన కమిటీ అట్టి చట్టాల్ని వెంటనే విడగొట్టి, లిస్టుతయారు చేసింది ఆచట్టాలు