పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

99


చట్టాల్ని సర్వులకోసం అని అన్నట్లుగానే. ఒక్కొ జాతిని దృష్టిలో పెట్టుకొని చేసిన వాటిని కూడా సర్వుల కోసం అనియుంటే బాగుండేది దక్షిణాఫ్రికాలో యీ చట్టాలు రంగుభేదచట్టాలని పేరు పొందాయి. నల్లరంగు, గోధుమ రంగు చర్మం కలవారిపై తెల్లరంగు చర్మంగలవారి పెత్తనం పెరగడమే అందుకు కారణం అందుకే వీటిని రంగు భేదచట్టాలు అని అన్నారు ఉదాహరణకు ప్రచలితమైన చట్టాలలో ఒకదాన్ని పరిశీలించి చూద్దాం పాఠకులకు తెలిసిన విషయమే నేటాలులో ఓటింగు హక్కును గురించి ఒక చట్టం ప్యాసు చేశారు. దాన్ని పెద్ద ప్రభుత్వం అంటే బ్రిటిష్ ప్రభుత్వం నిరాకరించింది. భవిష్యత్తులో ఏ ఆసియావాసికీ ఓటింగు హక్కు ఉండదు అని అందులో ఒక నిబంధనలో వ్రాసి పెట్టారు. దాన్ని యిప్పుడు మార్చవలసివస్తే, ఆసియావాసుల సంఖ్యబాగా పెరగటమే కాక, వారు సుశిక్షితులై గొప్పచైతన్యం పొందికూడా వుండటం అవసరం అయి వుండేది అటువంటి సదవకాశం కలిగినప్పుడే యీ రంగు విచక్షణా చట్టాలు రద్దవుతాయి. కళంకం తొలిగిపోతుంది

ఇది ఏకపక్షానికి వర్తించిన రంగుభేదానికి సంబంధించిన ఉదాహరణ నేటాలులో ప్యాసు చేయబడిన చట్టాన్ని నిరాకరించిన తరువాత మరో చట్టం అమల్లోకి తెచ్చారు. అందులోను రంగుభేదం కొట్టవచ్చినట్లు కనబడుతూనే వున్నది. అయినా అందలి రంగుభేదమనే తేలుకొండిని కొద్దిగా తుంపివేసినందున దాన్ని సర్వులకూ వర్తించే చట్టం అని అన్నారు. మరో చట్టం వున్నది. అందలి ఒక నిబంధనలో "ఏదేశంలో పార్లమెంటరీ ఎన్నికల విధానం అనగా బ్రిటిష్ లోకసభ సభ్యులను ఎన్నుకునే ఓటింగ్ హక్కువంటిది లేదో, ఆదేశ ప్రజలకు నేటాలులో ఓటింగ్ హక్కు పుండదు" అని వ్రాశారు ఈ నిబంధనలో భారతీయులు అని గాని ఆసియావాసులు అనిగాని ప్రత్యేకించి. పేర్కొనలేదు. భారతదేశంలో ఇంగ్లాండు వంటి ఓటింగు హక్కు విధానం వున్నదా లేదా అను విషయంపై లా నిపుణుల అభిప్రాయాలు వేరువేరుగా వుంటాయి. అయినా వాదన కోసం అప్పుడు అనగా 1894లో, భారతదేశంలో అట్టి ఓటింగు హక్కు లేదు. యిప్పటికి లేదు అని