పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

98

యుద్ధం తరువాత


ఫలితాల పరిస్థితుల్ని తెలుసుకోవడం సులభమవుతుంది. ట్రాన్స్‌వాల్, మరియు అరంజ్‌ఫ్రీస్టేటుల్లో బ్రిటిష్ జండా ఎగరసాగింది, అప్పుడు లార్డ్ మిల్నర్ ఒక కమిటిని ఏర్పాటు చేశాడు. పాత చట్టాల్ని క్షుణ్ణంగా పరిశీలించడం, వాటి పట్టికను తయారు చేయడం, ప్రజలు అనుభవిస్తున్న స్వాతంత్ర్యం అంకుశంగా పనిచేసే చట్టాల్ని, బ్రిటిష్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వున్న చట్టాల్ని గురించి యోచించి వివరాలు తెలుపడం ఆ కమిటీ పని యందు భారతీయుల స్వాతంత్ర్యాన్ని హరించివేస్తున్న చట్టాల్ని గురించికూడా చర్చించమని చెప్పి యుంటే బాగుండేది. కాని లార్డ్ మిల్నర్ భారతీయుల కష్టాల్ని గురించి ఏమాత్రం పట్టించుకోకుండా, తెల్లవారికష్టాల్ని తొలగించాలనే ఉద్దేశ్యంతోనే ఆకమెటీని నియమించాడు. తెల్లవారికి యిబ్బందులు కలిగిస్తున్న చట్టాల్ని త్వరగా రద్దుచేయడమే ఆయనలక్ష్యం త్వరత్వరగా ఆకమిటీ ఒక రిపోర్టు తయారు చేసింది. ఆంగ్లేయులకు ఇబ్బందులు కలిగించే చిన్న పెద్ద చట్టాలన్నీ ఆరిపోర్టు ప్రకారం వెంటనే రద్దు అయిపోయాయి. ఆకమెటీ భారతీయులకు వ్యతిరేకంగా వున్నచట్టాల లిస్టుకూడా తయారుచేసింది. యిట్టి చట్టాలన్నింటినీ ప్రోగుచేసి ఒక పుస్తక రూపంలో ఆకమిటీ ప్రకటింఛింది దానిలో ఏషియాటిక్ విభాగానికి సదవకాశం లభించినట్లయింది. ఆ చట్టాల్ని యిష్టం వచ్చినట్లు అమలుపరచేందుకు అవిభాగం పూనుకున్నది

భారతీయుల పేరు పెట్టి వారికి వ్యతిరేకంగా చట్టాలు చేయకుండా ఆ చట్టాలు అందరికీ వర్తిస్తాయి అని చెప్పియున్నా, వాటిని అమలు పరచడమా లేదా అను విషయం అధికారులకు వదిలి వేసియున్నా. సామూహికంగా సర్వులకు వర్తిస్తాయి అనే అర్ధం చెప్పియున్నా. తెల్లవాళ్లు మాత్రం వాటిని భారతీయులకే వర్తింపచేసి యుండేవాళ్లు అట్టి చట్టాలు చేసినవారి కోరిక సర్వుల కోసం అనే అర్థంతో నెరవేరియుండేది అందువల్ల ఎవ్వరికీ ప్రత్యేకించి అవమానం జరిగియుండేది కాదు కాలం గడిచినకొద్దీ వ్యతిరేకత తగ్గేది వాటిలో ఏమిమార్పులు చేయకుండానే. వాటిని ఉదారంగా అమలుపరచియుంటే, ఎవరిని అణిచివేయడానికి యిట్టి చట్టాలు చేశారో, వారికి కొంత ఊరట కలిగియుండేది. తరువాత చేసిన