పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

97


భయం నిజమేనని తేలింది. తెల్ల వాళ్ల ప్రవేశానికి అనుమతి పత్రం అవసరంలేదని, భారతీయులు మాత్రం అనుమతిపత్రం తీసుకోవడం అవసరమని నిర్ణయించారు. గతంలో ట్రాన్స్‌వాల్ ప్రభుత్వం చేసిన చట్టం కఠోరంగా వున్నది. కాని దాన్ని అమలు చేసే విషయంలో మెత్తగా అధికారులు వ్యవహరించారు. అయితే అది బోయర్ ప్రభుత్వపు ఉదారతకు మంచితనానికి తార్కాణం కాదు. ఆ ప్రభుత్వ అధికారుల అలసత్వమే అందుకు కారణం అవిభాగంలో పని చేసే అధికారులు మంచివారే అయినా. తమమంచితనాన్ని ప్రదర్శించుటకు బోయర్ ప్రభుత్వ హయాంలో వాళ్లకు లభించినంత అవకాశం, బ్రిటిష్ ప్రభుత్వ హయాములో లభించలేదు బ్రిటిష్ ప్రభుత్వం పాతబడి రాటుతేలినందున, అందుపనిచేసే అధికారులు యంత్రంవలె పని చేయవలసి వచ్చింది. ఆ అధికారుల పనితీరుపై, ఒకటి తరువాత మరొకటి చొప్పున ఎగుడుదిగుడు అంకుశాలు అనేకం పనిచేస్తూ వుంటాయి. అందువల్ల బ్రిటిష్ రాజ్యాంగపు పరిపాలనా పద్ధతి ఉదారంగా వుంటే ప్రజలకు ఉదారంగా లాభం చేకూరుతుంది. కాని దాని పద్ధతి సంకుచితంగాను, దుర్మార్గంగాను వుంటే, దాని నియంత్రణ ఎక్కువై ప్రజలు అణిచివేతకు గురి అవుతారు. యిందుకు తలక్రిందులుగా ట్రాన్స్‌వాల్ యందలిగత ప్రభుత్వ పరిపాలనా పద్ధతి వుండేది. వాళ్ల పద్ధతి ప్రకారం ప్రజలకు చట్టాలవల్ల కలిగే ప్రయోజనాలన్నీ, ప్రభుత్వాధికారుల యిష్టం ప్రకారం లభిస్తూవుండేవి. యీ పద్ధతి ప్రకారం ట్రాన్స్‌వాల్‌లో బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత భారతీయులకు సంబంధించిన చట్టాలు కఠినంగా అమలులోకి రాసాగాయి మొదట చట్టాలనుంచి తప్పించుకునేందుకు అనేకమార్గాలు వుండేవి. అవన్నీ యిప్పుడు బందు అయ్యాయి ఏషియాటిక్ విభాగం వారు కఠినంగా వ్యవహరించడం ప్రారంభించారు. దానితో అసలు చట్టాల్ని రద్దుచేయిద్దామనే మా కృషి మరుగునపడి, వాటిని అమలుపరుస్తున్న కఠినవైఖరిని ఎలా సరిచేయడమా అనే తపన ఎక్కువై పోయింది

ఇక ఒక సిద్ధాంతాన్ని గురించి త్వరగానో లేక ఆలశ్యంగానో యోచించడం అవసరం దానివల్ల భారతీయుల దృక్పధాన్ని, ఆతరువాత కలిగిన పరిణామాల