పుట:తెలుగు వాక్యం.pdf/99

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

అనుకృతి

85

పై చర్చను బట్టి సర్వభాషనూ అనుకరణ సన్నిహితమైన నిర్మాణం నుంచి నిష్పన్నం చెయ్యొచ్చునని చెప్పవచ్చు. ఇదే నిజమైతే (197) b. లో ద్వితీయావిభక్తి కొత్తగా వచ్చింది కాక గుప్త నిర్మాణపు సంబంధావశేషంగా భావించవచ్చు.

పరోక్షవిధిలో గమనించవలసిన ఇంకో చిన్న విశేషం ఉంది. ప్రత్యక్ష విధిలో ఏక బహువచన భేదం క్రియలో వ్యక్తమవుతుంది. ఉదాహరణ 'రా', 'రాండి'. పరోక్ష విధిలో ఏకవచన బహువచనాలు రెండిట్లోనూ ఒకే క్రియారూపం ఉంటుంది. ఉదా : 'అతన్ని రమ్మని చెప్పు', 'వాళ్లని రమ్మని చెప్పు' పరోక్ష విధిక్రియలో లింగపురుష భేదం కూడా వ్యక్షం కాదు.

3.6 : ప్రశ్నార్థకాది వాక్యాల్లో ఇంతకుముందు పేర్కొన్న కర్తృపద పరివర్తనాది మార్పులు తప్ప వేరే మార్పులు జరగవు. కాకపోతే ప్రధానక్రియ అను ధాతు నిష్పన్నంకాక అడుగు లేక పశ్నను సూచించే ఆట్లాంటి క్రియ ఏదన్నా ఉంటుంది.

(201)

a. (i) "నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు" అని అన్నాడు.
   (ii) నేనెక్కడికి వెళ్తున్నానని అడిగాడు.

b. (i) “నువ్వు రేపొస్తావా" అని అన్నాడు.

(ii) నేను రేపు వస్తానా
                రేపు వస్తానేమో -

} అని అడిగాడు

ఈ పై వాక్యాల్లో ప్రత్యక్ష పరోక్షానుకరణాలు రెండిట్లోనూ అడుగు క్రియను పయోగించవచ్చు. కాని పరోక్షాను కరణలో అను క్రియా ప్రయోగం ఉండదు. ఆ ప్రశ్నకు ఏమో ఆదేశం వికల్పంగా అవుతుంది.

3.71 : ప్రథమ మధ్యమ పురుష సర్వనామాలున్న క్రియారహిత వాక్యాలను అనుకరించినప్పుడు కూడా ఇంతకు ముందు పేర్కొన్న విధంగానే సర్వనామాల్లో మార్పులు జరుగుతై.

(202)

a. (i) అతను "నేను విప్లవ కవిని” అన్నాడు,
   (ii) అతను తను విప్లవ కవిని అన్నాడు,
   (iii) అతను తను విప్లవ కవినని చెప్పాడు.