పుట:తెలుగు వాక్యం.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

84

తెలుగు వాక్యం

నిశ్చయార్థక వాక్యాలనుకూడా స్వతంత్ర వాక్యాలుగాకాక ఇంకోవాక్యంలో గర్భవాక్య నిర్మాణంనుంచి నిష్పన్నంచెయ్యాలనే ప్రతిపాదనకూడా ఉంది. ఉదాహరణకు. (200) b. నుంచి లోపకార్యాలద్వారా (200) a. ని నిష్పన్నం చేయవచ్చు.

(200)

a. "ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేదు” అని నేను నీతో అంటున్నాను.

b. “ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేదు. "

3 54 : ఆనుకృతికి, దీనికి ఉన్న సామ్య భేదాలను గమనించటం అవసరం. అనుకృతిలో అనుకృతాంశం పునశ్చర్వితం. ఇక్కడ మొదటిసారి అన్నట్లుగా భావించబడింది. అనుకృతిలో వక్త, అనువక్త, శ్రోత, అనుశ్రోత వుంటారు. ఈ ఇద్దరూ ఒకటే కావటానికి వీలుండొచ్చు. అది వేరే విషయం కాని అనుకృతాంశానికి భాషాపరంగా అనుకృతిలో ప్రథమేతరస్థితి ఉంటుంది. (200) లో ఒకేవక్త, ఒకే శ్రోత, భావించబడ్డారు.

3.4 పేరాలోఇచ్చిన బొమ్మలో 'వ, శ్రో,' తో సూచించినస్థితి (200) లో సూచించిన స్థితికి సమానం. భావం భాషాస్థితిని పొంది వక్తృముఖంగా మొదటిసారి బహిర్గతమైనపుడు వక్తృశ్రోత లెవరెవరో ఇద్దరికీ తెలుసు కాబట్టి భాషలో అస్థితిలో (మొదటిస్థితిలో) వక్తృశ్రోతల వ్యక్తీకరణ సాధారణంగా జరగదు. వక్తృశ్రోతలు లేకుండా భాషకు స్థితిలేదు. వక్తృశ్రోతలు ఒకరే అయితే బహిరాలోచనారూపం అవుతుంది.

(200) a లో వాక్యానికి, అనుకృతికి ఉన్న సామ్యం స్పష్టమే. ఆ వాక్యంలో ప్రధానక్రియను భూతకాలికంచేస్తే ఆ వాక్యానికి పూర్వస్థితి సృహకలుగుతుంది. భవిష్యకాలికంచేస్తే ద్వితీయస్థితి సంభావ్యమవుతుంది. వర్తమానకాలేతరమైన ఏ క్రియను వాడినా అనుకృతాంశానికి నైకస్థితి ఆపాదితమవుతుంది. నైకస్థిత్యా పాదితమైన ఏ వాక్యమైనా అనుకరణ వాక్యమే.

అంటే అనుకరణ, నిరనుకరణ వాక్యాలకు భేదం ఏక, నైకస్థితుల్లోనే ఉంది. వాగ్వాపారంలో పాత్రలు ద్వితీయ స్థితిలో ఒకరే అయినా కాలభేదాన్ని బట్టి. భిన్నాలుగా భావిస్తే అనుకరణలో నైకవక్తృ శ్రోతృవర్గం, నిరనుకరణలో ఏక వక్తృ శ్రోతృవర్గమూ ఉంటుందని చెప్పవచ్చు.