పుట:తెలుగు వాక్యం.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

viii

గలరనుకుంటాను అధిక వివరణ కావల్సివస్తుందనీ, అచ్చువెయ్యటంలో చిక్కులు వస్తయ్యనీ, ఇట్లాంటి పరిశీలనకు అవసరమైన చెట్టు బొమ్మల్ని (Phrase markers) వెయ్యలేదు.

ఈ పుస్తకంలో వ్యాకరణ సమ్మతమైన వాక్యాలను వ్యాకరణ విరుద్ధమైన వాక్యాలతో పోల్చిచూపటంద్వారా వివరించటానికి ప్రయత్నించాను. వ్యాకరణం అంటే వ్యవహర్తలను ఇట్లా మాట్లాడమని గాని, రచయితలను ఇట్లా రాయమని గాని శాసించే లిఖిత సూత్రాల పుస్తకం అనే అర్థంలో వాడటం లేదు. భాషా వ్యవహారంలో వ్యవహర్తలు పాటించే నియమావళి అనే అర్థంలో వాడుతున్నాను. ఈ నియమాలు వ్యవహర్తల మనస్సులో అజ్ఞానంగా ఉంటై. వాటిని జాగ్రత్తగా గ్రహించి వ్యక్తరూపం ఇయ్యటమే భాషాపరిశోధకులు చేసేపని.


వ్యాకరణ సమ్మతిని నిర్ణయించటానికి పనిముట్లు ఉండవు. భాషా పరిశీలన ద్వారా పరిశోధకుడు ఏర్పర్చుకున్న అంతర్దృష్టి తప్ప వేరే ఆధారంలేదు. అదీగాక వ్యాకరణ సమ్మతి వ్యవహర్తల, ప్రాంతాలనుబట్టి, అలవాట్లనుబట్టి, నమ్మకాలను బట్టి ఉండవచ్చు. అందువల్ల ఈ పుస్తకంలో కొన్ని వాక్యాల వ్యాకరణసమ్మతి, ఆసమ్మతులను గురించి నేను చేసిన నిర్ణయాలతో కొందరు పాఠకులు ఏకీభవించక పోవచ్చు. అంతేగాక ఉదాహృత వాక్యాలకు సందర్భాలు కేవలం ఊహ్యాలే గనుక సమ్మతి, ఆసమ్మతులలో వ్యత్యాసం రావటం సహజం. అందుకోసం సాధ్యమైనంత సహజంగా ఉండే ఉదాహరణలను ఎన్నుకోటానికి చాలాచోట్ల ప్రయత్నించాను.

పూర్తిగా వ్యాకరణ విరుద్ధమనితోచిన వాక్యాలకు, అక్కడ ఉద్దిష్టమైన అర్థాన్ని ఇయ్యలేని వాక్యాలకు, పువ్వు గుర్తుంచాను. వ్యాకరణ సమ్మతి సందేహమని తోచిన వాక్యాలముందు ప్రశ్నార్థక చిహ్నం ఉంచాను. ఒక సంఖ్యముందు పువ్వు గుర్తుంటే అందులో ఉదాహరించిన వాక్యాలన్నీ వ్యాకరణ విరుద్ధాలనీ (లేక ఉద్ధిష్టార్థబోధకసమర్థాలు), a, b, c, d అనే అక్షరాలముందుంటే కేవలం ఆ వాక్యాలు మాత్రమే వ్యాకరణ విరుద్ధాలనీ ఉద్దేశించాను. ఈ పద్ధతి ప్రశ్నార్థక చిహ్నం విషయంలో కూడా పాటించబడింది.

ఇందులో ముఖ్యంగా పరిశీలించింది ఆధునికభాషలో వ్యవహరించటానికి వీలున్న వాక్యాలను. ఈ పరిశీలన ఆధునిక రచనాభాషకుకూడా వర్తిస్తుంది. వాక్య