పుట:తెలుగు వాక్యం.pdf/85

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

సంశ్లిష్ట వాక్యాలు

71

రెండు చోట్ల ఏమో (ఏం + ) శబ్దాన్ని ప్రతిపాదించి -శబ్ద ప్రశ్నలతో వచ్చినప్పుడు ఏమో > ఓ అనే మార్పును సూచించవచ్చు. రెంటిమధ్య పెద్ద భేదం లేదు. శబ్దం వాక్యంలో కాని, పదంలోకాని శబ్దాన్ని అపేక్షిస్తుంది. అది లేనిచోట (ఆ-శబ్ద ప్రశ్నలు) ఏం అనే శబ్దాన్ని అదనంగా ప్రతిపాదించాలి.

2.82 : ప్రశ్నకు సమాధానం చెప్పమని శ్రోతను అడగటం పృచ్ఛకుని లక్ష్యం. అందువల్ల సుజాత ఊరినుంచి ఎప్పుడు వస్తుంది? అనే ప్రశ్నకు సుజాత ఊరినుంచి ఎప్పుడు వస్తుందో నాకుచెప్పు అనీ, సుజాత ఊరినుంచి వచ్చిందా? అనే ప్రశ్నకు సుజాత ఊరినుంచి వచ్చిందేమో నాకు చెప్పు అనీ అర్థాలుగా గ్రహించవచ్చు. ఈ పద్ధతిలో ఆలోచిస్తే ప్రత్నక్ష ప్రశ్నలను పరోక్ష ప్రశ్నలనుంచి లోపకార్యం ద్వారా నిష్పన్నం చెయ్యవచ్చు

పరోక్ష ప్రశ్నల్లో ప్రధాన వాక్యంలో క్రియ కనుక్కోను, చూచు, తెలియు, వంటి విషయసేకరణ సంబంధి కావాలి.

2.83 : ఏమో శబ్దంతో ఉన్న వాక్యాల్లో ప్రధాన వాక్యం ప్రశ్న, విధి, వ్యతిరేక , భావి బోధక వాక్యాలే రాగలవు.

(185)

సుజాత ఊరినుంచి వచ్చిందేమో చూడు (చూశావా, చూడలేదు. )

పై వాక్యాల్లో చూశాను అని ప్రయోగిస్తే ఆ వాక్యాన్ని వ్యాకరణ సమ్మతంగా గ్రహించటం కష్టం.

ఓ-శబ్దయుక్త వాక్యాలకు (-ప్రశ్నలు) ఇట్లాంటి నిబంధన ఉన్నట్టు లేదు.

(186)

a. సుజాత ఎక్కడుందో చూశాను.

ఈ పై వాక్యానికి ఈ కింది రెండు వాక్యాలూ సమానార్థకాలు.

b. సుజాత ఎక్కడుందో ఆచోటు చూశాను.
c. సుజాత ఉన్నచోటు చూశాను.

ఈ వాక్యాల్లో (b) యత్తదర్థక వాక్యం. (c) విభక్త్యర్థక నామ్నీకరణం ద్వారా ఏర్పడింది. అంటే (178) (a) ని 187) b నుంచి నిష్పన్న మైనట్లుగా భావించవచ్చు. (177) లాంటి వాక్యాలకు. సమానార్థకమైన యత్తదర్థక వాక్యాలు కాని, విభక్త్యర్థక నామ్నీకరణ వాక్యాలుగాని లేవు.