పుట:తెలుగు వాక్యం.pdf/84

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

70

తెలుగు వాక్యం

వాక్యం బోధించే విషయ సర్వస్వాన్ని బోధించే నామ్నీకరణాన్ని విషయార్థక నామ్నీకరణం అంటారు. విషయార్థక నామ్నీకరణం జరిగినప్పుడు ప్రధానవాక్యంలో శ్రవణ, బుద్ధ, వచ్యర్థకాది విషయ సంగ్రహణార్థక ధాతువులే క్రియలుగావస్తై.

ఏకవాక్యంలో ప్రాధాన్య వివక్షకోసం క్రియ తచ్చబ్దంతో నామ్నీకృతమయ్యే పద్ధతి పూర్వమే చెప్పబడింది. (చూ. 1.27.)

2.8 : పరోక్ష ప్రశ్నలు : ఏ భాషలో నయినా ప్రశ్నార్థక వాక్యాలను రెండు రకాలుగా విభజించవచ్చు. 1. (నూతన) విషయాపేక్షక ప్రశ్నలు. 2. విషయ నిర్థారక ప్రశ్నలు. ఎవరు, ఎక్కడ, ఎప్పుడు. ఎందుకు, ఎట్లా, ఏమిటి (ఏం) మొదలైన ప్రశ్నార్థక శబ్దాలతో వచ్చేవి, విషయాపేక్షక ప్రశ్నలు. అనే శబ్దాంతంగా వచ్చేవి విషయ నిర్థారక ప్రశ్నలు. మొదటి రకం ప్రశ్నలకు సమాధానంగా నూతన విషయ బోధక పదాలు, వాక్యాలు సమాధానాలుగా అపేక్షితాలు. రెండోరకం ప్రశ్నలకు సమాధానాలు తెలిస్తే అవును, కాదు అనే పదాలతో వ్యక్తం చెయ్యొచ్చు. శ్రోతకు సమాధానాలు తెలియనప్పుడు ఏ ప్రశ్నకైనా ఏమో అనే శబ్దం సమాధానంగా ఇయ్యవచ్చు. అంటే ఏమో అనే శబ్దాన్ని ఒక వ్యవహర్త సమాధానంగా వాడితే అడగబడిన ప్రశ్నకు సమాధానం తనకు తెలీదు అని చెప్పటం అతని ఉద్దేశంగా మనం గ్రహించవచ్చు.

2.81 : ప్రశ్నార్థక పదయుక్తమైన ప్రశ్నలను ఇంకో వాక్యంలో ఇమిడ్చి చెప్పాలంటే వాక్యాంతంలో శబ్దాన్ని అనుసంధించాలి. ఆ శబ్దంతో వచ్చే ప్రశ్నల్ని ఇమడ్చాలంటే ఏమో శబ్దాన్ని అనుసంధించాలి.

(184)

a. సుజాత పూరి నుంచి ఎప్పుడొస్తుందో నీకు తెలుసా ?
b. సుజాత పూరినుంచి వచ్చిందేమో నీకు తెలుసా ?

పై వాక్యాలనిబట్టి - శబ్ధయుక్త ప్రశ్నలకు శబ్దానికి, - శబ్దయుక్త ప్రశ్నలకు ఏమో శబ్దానికి ఉన్న సంబంధాన్ని గ్రహించవచ్చు. సంశ్లిష్ట వాక్యనిర్మాణంలో - శబ్దయుక్త ప్రశ్నలకు - శబ్దాన్ని ఆగమంగానూ, - శబ్దయుక్త ప్రశ్నలకు ఏమో శబ్దాన్ని ( - శబ్దానికి) ఆదేశంగానూ చెప్పవచ్చు.