పుట:తెలుగు వాక్యం.pdf/83

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

సంశ్లిష్ట వాక్యాలు

69

2.733: తెలుగులో కొన్ని క్రియలు కాలబోధకప్రత్యయం లేకుండానే ప్రయుక్తమవుతై. వాటికి తచ్ఛబ్ధంతో నామ్నీకరణం సాధ్యంకాదు. ఈ క్రియలు ప్రాయికంగా అనుబంధ క్రియలు.

(181)

a. ఈ దేశంలో స్వేచ్ఛగా ఉపవాసం ఉండవచ్చు.
b. ఈ దేశంలో స్వేచ్చగా మాట్టాడకూడదు.

పై వాక్యాలనుంచి • ఉండవచ్చింది అనే నామ్నీకృతరూపాన్ని నిష్పన్నం చెయ్యలేం. అట్లాగే * మాట్లడ గూడ నిది అనేది ఈ ఆర్థంలో సాధ్యమవుతున్నట్టుగా తోచదు

2.734 : పై వాక్యాల్లో ప్రయుక్తమైన అది అనే శబ్దం వాక్యవిషయాన్ని సూచిస్తుంది. కాని అది కి చాలా ప్రయోజనాలున్నై. అందులో ఒకటి సర్వ నామంగా ప్రయోగించటం. విభక్త్యర్థ నామ్నీకరణంలో ఉద్దేశ్యంగా మారిన నామానికి అది ఆదేశంగా రావచ్చు. లేక మొత్తం వాక్య విషయాన్నే సూచించవచ్చు.

(182)

 
a. నువ్వు ఢిల్లీనుంచి తెచ్చింది నాకు తెలుసు.

ఈ పైవాక్యానికి కింది వాక్యాలు రెండూ అర్థాలే.

b. నువ్వు ఢిల్లీ నుంచి తెచ్చావని నాకు తెలుసు.
C. నువ్వు ఢిల్లీనుంచి ఏం తెచ్చావో నాకు తెలుసు.

ఈ రకమైన భిన్నార్థబోధక్రియ సకర్మకమైనప్పుడే సాధ్యం. ఇంకోరకంగా చేస్తే ఉద్దేశ్యనామం మనుష్యవాచకేతర కర్మపదం అయినప్పుడే ఇట్లాంటి అర్థభేదం వస్తుంది.

2.735 : ఈ రకమైన నామ్నీకరణం విధ్యాదులకు సాధ్యంకాదు. కేవల నిశ్చయార్థక వాక్యాలకు, వాటి వ్యతిరేకర్థాదులతో సహా ఈ నామ్నీకరణం సాధ్యమవుతుంది. కిమర్ధక ప్రశ్నలతో ఉన్న వాక్యాలకు ఈ రకమైన నామ్నీకరణం చెయ్యొచ్చుకాని, అది వాక్య విషయ సర్వస్వ బోధకంకాదు. ఉదాహరణకు ఈ కింది వాక్యం చూడండి.

(183)

మీ యింటికి ఎవరు వచ్చిందీ తెలుసు.

ఈ పై వాక్యంలో తచ్ఛబ్దం (అది>ది) ప్రశ్నార్థక శబ్దార్థానికే పరిమితం.