పుట:తెలుగు వాక్యం.pdf/82

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

68

తెలుగు వాక్యం

అను ప్రయుక్తం చెయ్యాలని పూర్వమే చెప్పబడింది. క్రియలేని వాక్యాలు 'స్థితి' బోధకాలు. కాలబోధలో అగు ధాతువుచేర్చినప్పుడు 'పరిణామ' బోధకాలవుతై. నామ్నీకరణం రెంటికీ సాధ్యమే. అందువల్ల నామ్నీకతమైన క్రియారహిత వాక్యాలకు స్థితిపరంగాను, పరిణామపరంగాను అర్థం చెప్పవచ్చు.

(180)

a. అతను డాక్టర్ అయింది నాకు తెలుసు.

ఈ పై వాక్యానికి కింది వాక్యాల్లో వ్యక్తమయ్యే రెండర్థాలూ ఉన్నై.

b. అతను డాక్టరు అయ్యాడని నాకు తెలుసు. (పరిణామం.)
c. అతను డాక్టరు అని నాకు తెలుసు (స్థితి).

అయితే భూతకాల ప్రత్యయ యుక్తమయినప్పుడే ఈ భిన్నార్థబోధ ఉంటుంది. మిగతా క్రియాజన్య విశేషణాలు ప్రయోగించినప్పుడు పరిణామార్థం ఒక్కటే వస్తుంది.

d. అతను డాక్టరు ఆయ్యేది నాకు తెలుసు.
e. అతను డాక్టరు అవుతున్నది నాకు తెలుసు.

వ్యతిరేక క్రియా జన్యవిశేషణం ప్రయోగించినప్పుడు మళ్ళీ రెండర్థాలు సాధ్యమే.

f. అతను డాక్టరు కానిది నాకు తెలుసు.

కానిది అనే నామ్నీకృతరూపానికి కాలేదు, కాదు అనే రెండింట్లో ఏదైనా మూలరూపం కావచ్చు.

క్రియాజన్య విశ్లేషణం కేవలధాతువునుంచి కాలబోధక యుక్తమైన క్రియా రూపాలనుంచి నిష్పన్నమైనట్లుగా భావించాలి. లేకపోతే క్రియాజన్య విశేషణంలో కాలాదికాది అర్థాలకు గతి కలిగించలేం. కాని క్రియారహిత వాక్యాలకు కాలబోధ లేదు. అయినా క్రియాజన్యవిశేషణంతో నామ్నీకరణం సాధ్యమయింది. స్థితిబోధలో కూడా నామ్నీకరణం సాధ్యమయిందన్నమాట. అయితే విశేషణరూపంలో మాత్రం భూతకాలిక ప్రత్యయంఉంది. కేవల నామ్నీకరణ ప్రయోజనమాత్రంగానే ఈ ప్రత్యయం ఉంటుంది. అంటే వాక్యాన్ని (దానితోపాటు క్రియను) విశేషణంగా చెయ్యటమే దీని ప్రయోజనం.