సంశ్లిష్ట వాక్యాలు
63
ప్రశ్నార్థక శబ్దం నామాన్ని సూచించేట్టయితే ఈ నామ్నీకరణ సాధ్యం కాదని పై వాక్యాల్ని బట్టి గ్రహించవచ్చు.
2.7263 : ప్రశ్నాభావంలో కూడా ఈ నామ్నీకరణం జరుగుతుంది. కాని భావార్ధక నామం తరవాత వచ్చిన పదబంధానికి ఏదైనా ప్రాధాన్యసూచకమైన శబ్దాన్ని అనుబంధించినప్పుడే అది వ్యాకరణ సమ్మత మవుతుంది.
(170) | a. నేను హైదరాబాదులో ఉంటున్నాను | |
ఇంతకు పూర్వం సామాన్య వాక్యాల్లో చర్చించిన (చూ. 1.12, 1-26) ప్రాధాన్య వివక్షామూలక నామ్నీకరణంలో భాగమే ఇది. కాకపోతే ప్రాధాన్యాన్ని వివక్షించటానికి పదక్రమ వ్యత్యయమే కాక ప్రాధాన్యాన్ని సూచించే శబ్దాలు (ఆ, ఏ, అట, కాదు - ఇత్యాదులు) ఇక్కడ పదక్రమ వ్యత్యయం తరవాత కూడా అవసరమే కావటం విశేషం. కర్తృ, కర్మ పదాలను సూచించే నామాలను ఇట్లా వ్యత్యయం చెయ్యటానికి వీల్లేకపోవటం అధికనియమం. (168) వాక్యాల్లో ఇట్లాంటి శబ్దం విడిగా లేకపోయినో కిమర్థక శబ్దం ఇట్లాంటి పాత్రను నిర్వహిస్తున్నది. భావార్థక నామంతో ఇట్లాంటి వ్యత్యయం భూతకాలపు అర్థాన్ని ఇయ్యలేక పోవటం ఇక్కడ గమనించాల్సిన ఇంకో విశేషం.
2. 727 : మిగతా నామ్నీకరణాలకన్నా భావార్థక నామ్నీకరణం ఇంకో విధంగా కూడా విశిష్టమైనది. మామూలు సిద్ధనామాల్లాగే భావార్థక నామానికి వివిధార్థాల్లో నామవిభక్తులు చేరతై. మిగతా మకారాంత నామాల్లాగే కు, ను విభక్తులు పరమైనప్పుడు మకార లోపమూ, పూర్వస్వర దీర్ఘమూ, జరిగి, ని ఆగమంగా వస్తుంది. ఈ ఆగమం తర్వాత నామం ఇకారాంతం కావటంవల్ల కు, ను లు కి, ని లు అవుతై. భావార్థకనామం అమూర్తనామం. అందువల్ల అమూర్తనామంతో సాధ్యమయ్యే ఆర్థాలే విభక్తిపరమైనప్పుడు వస్తై.