62
తెలుగు వాక్యం
(167) | a. నువ్వు నాదగ్గర పుస్తకం తీసికెళ్ళటం (నాకు) గుర్తు. | |
ప్రధాన వాక్యంలో అనుభోక్తతో సమంగా ఉపవాక్యంలో కర్త ఉంటే (166)లో వాక్యాలు వ్యాకరణ సమ్మతమవుతై. ఇట్లాంటి వాక్యాల్లో భావార్థక నామాన్ని తొలగించినా అర్థభంగం కలగదు. (165) లో వాక్యాలు అట్లా ఏర్పడినవే. కాని (167)a లో భావార్థక నామాన్ని లోపింపజెయ్యటానికి వీల్లేదు. . గుర్తు క్రియా రహితంగా ప్రయోగించినప్పుడు విద్యమాన ప్రాగ్వ్యాపారమే విషయం కాగలదు. మిగతా ఆఖ్యాతాలకు ప్రత్యేక కాలనియమం లేని వ్యాపారాలే విషయాలుగా వస్తై. అట్లాంటి చోటనే భావార్థక నామాలను లోపింపజేసినా ఆర్థ భంగం రాదు..
2. 7261 : ఏక వాక్యంలో కూడా క్రియ కొన్నిచోట్ల భావార్థక నామంగా మారుతుంది. ఆ ప్రక్రియ కింది వాక్యాల్లో చూడవచ్చు.
(168) | a. మీరు ఎప్పుడు వస్తారు? → మీరు రావటం ఎప్పుడు? | |
బాణం గుర్తుకు ఎడం పక్కన ఉన్న వాక్యాలకు కుడి పక్కన ఉన్న వాక్యాలకు అర్థభేదం లేదు. కాని ఎడం పక్క వాక్యాలలో భూతకాలక్రియ ఉంటే ఈ రకం నామ్నీకరణం సాధ్యమయినట్టు కనపడదు. పై నామ్నీకృత వాక్యాల్లో ఎప్పుడు వచ్చారు? ఎక్కడికి వెళ్లారు? ఎందుకు వచ్చారు? అనే అర్థాలు రావటం లేదు. కాలబోధను సూచించే పదసాహాయ్యం లేనప్పుడు భావార్థక నామం భూతేతర కాలబోధక మవుతుందని చెప్పుకోవాలి. ప్రశ్నార్థక శబ్దానికి ప్రాధాన్య వివక్ష ఈ నామ్నీకరణ సార్థక్యం.
2. 7262 : ఈ రకపు నామ్నీకరణ ప్రశ్నార్థక శబ్దాలన్నిటికి సాధ్యమవు తున్నట్టు లేదు.
*(169) | a. మీరు ఏం చేస్తారు? → మీ తేవటం ఏమిటి ? | |