Jump to content

పుట:తెలుగు వాక్యం.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

44

తెలుగు వాక్యం

సూచించిన అర్థం లాంటిది లేదు కాని b, c లలో సూచించిన అర్థాలకు తుల్యమైన అర్థాలున్నై.

2.44 : చేదర్థకంలో లాగే మిగతా అసమాపక క్రియా రూపాలన్నిటికీ కాని శబ్ద ప్రయోగం చెయ్యవచ్చు. కాని అవ్యర్థంలో కాని శబ్ద ప్రయోగంవల్ల అర్థంలో మార్పుండదు.

(126)

a. ఉత్పత్తి పెరిగినా ధరలు తగ్గవు.
b. ఉత్పత్తి పెరిగినా దాని ధరలు తగ్గవు.

ఇంతకు పూర్వమే చెప్పినట్లుగా అప్యర్థక వాక్యాల్లో వ్యాపారాల మధ్య నిరనుబద్ధత (disjunction) వ్యక్తమవుతుంది. క్త్వార్థక, శత్రర్థక, చేదర్థకాది మిగతా వాక్యాల్లో వ్యాపారాల మధ్య సానుబద్ధత వ్యక్తమవుతుంది. అందువల్ల అక్కడ కాని శబ్దప్రయోగంవల్ల ఈ అనుబంధం దెబ్బ తింటుంది. తనకు పూర్వ మున్న అసమాపక క్రియకు కాని శబ్దం వైరుధ్యాన్ని సమకూరుస్తుంది. అందువల్ల ఆ వాక్యాల్లో అసమాపక క్రియతో కాని శబ్దప్రయోగం సమాపక క్రియలో వ్యతిరేకతని కోరుతుంది. అసమాపక క్రియలోనే వ్యతిరేకత ఉంటే కాని శబ్దం ప్రయోగార్హం కాదు. అందువల్ల కాని శబ్దంతో ఉన్న ఈ కింది వాక్యాలు వ్యాకరణ విరుద్ధాలు.

*(127)

a. అతను అన్నం తినకగాని కాలేజికి వెళ్తాడు .
b. ఉత్పత్తి పెరగకపోతేగాని ధరలు తగ్గుతై

పై వాక్యాల్లో ప్రధానక్రియ వ్యతిరేకంలో ఉన్నాగాని తప్పేఅవుతై. దీన్ని బట్టి ఆప్యర్థక క్రియావాక్యాలు నిరనుబద్ధతను (disjunction),. అవ్యర్థకేతర అసమాపక క్రియావాక్యాలు సానుబద్ధతను (conjunnction) వ్యక్తం చేస్తయ్యని తెలుస్తుంది.

2.45 : కాని , అయినా అనే శబ్దాలకు శబ్దరీత్యా అను ధాతువుతో సంబంధముంది. మొదటిది వ్యతిరేక క్రియాజన్య విశేషణం. రెండోది అవ్యర్థ రూపం. ఈ రెండూ ఇతరత్రా కూడా నిరనుబద్ధతను బోధించ గలవు. కలమయిన , పెన్సిలయిన ; కలంగాని, పెన్సిల్ గాని ఆనే పదబంధాలు కలమో, పెన్సిలో