పుట:తెలుగు వాక్యం.pdf/57

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

సంశ్లిష్ట వాక్యాలు

43

ఉన్నప్పుడు మొదటి వాక్యంలో అప్యర్థక క్రియ ఉంటుంది, అందుకే ఒక్కోసారి రెండు వ్యాపారాల మధ్య వైరుధ్యం కూడా ఉంటుంది. అందువల్ల తరచుగా ఏవైనా ఒక క్రియలో వ్యతిరేక బోధకత కూడా ఉంటుంది.

(121)

a. వాడికి చదివినా మార్కులు రాలేదు.
b. వాడికి చదివినా మార్కులు రావు.

ఈ పై వాక్యాల్లో అప్యర్థక క్రియకు బదులు చేదర్థక క్రియకు కూడా అనే శబ్దాన్ని చేర్చి వాడిన అర్థభేదం రాదు.

(122)

a. వాడికీ చదివితే కూడా మార్కులు రాలేదు.
b. వాడికి చదివి కూడా మార్కులు రావు.

2.42 : క్రియాజన్య విశేషణంతో తయారయిన నామం చేదర్థకంలోలాగే (చూ. వాక్యాలు 111.) ఇక్కడ కూడా ప్రధానాఖ్యాతంగా ప్రయోగించవచ్చు.

(123)

a. వాడికి చదివినా మార్కులు వచ్చేవి కావు.
b. వాడికి చదవకపోయినా మార్కులు వచ్చేవి.

2.43 : ఈ అప్యర్థక వాక్యాల్లో ఒక్కోసారి భిన్నార్థాలు వస్తై.

(124)

ఆయన డబ్బు తీసుకున్నా మార్కులు వేసేవాడు కాదు.

ఈ పై వాక్యానికి మూడు రకాల అర్థాలున్నై. అవి ఈ కింద సూచించబడుతున్నై.

(125)

a. ఆయన డబ్బు తీసుకున్నా మార్కులు వేసే మనిషి కాదు.
b. ఆయన డబ్బు తీసుకునేవాడు కాని మార్కులు వెయ్యలేదు.
c. ఆయన డబ్బు తీసుకోలేదు, మార్కులు వెయ్యలేదు.

చివరి ఆఖ్యాతానికున్న భిన్నవ్యాకరణ ప్రవృత్తులవల్ల ఈ భేదం వచ్చింది. కేవల నామ ప్రవర్తనవల్ల (125a)లో అర్థం వచ్చింది. భూతకాలంలో అలవాటును సూచించే ఆఖ్యాతంగా ఈ రూపానికి ప్రవృత్తి ఉండటంవల్ల (125b)లో అర్థం వచ్చింది. అపిచేదర్థకాల్లో భూతకాల సంభావ్యమాన వ్యాపారాన్ని సూచించే ప్రవృత్తివల్ల (125c)లో అర్థం వచ్చింది. (123 a, b) లకీ (125) a లో