పుట:తెలుగు వాక్యం.pdf/50

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

36

తెలుగు వాక్యం

వీటిల్లోకూడా హేత్వర్థాన్ని గుర్తించవచ్చు. పై వాక్యాల్లో చదవటంవల్ల, చెప్పటంవల్ల అనే రూపాలను క్త్వార్థక క్రియకుబదులు వాడవచ్చు. హేత్వర్థంలో క్త్వార్థకక్రియ ఉన్నప్పుడు ప్రయోజనరాహిత్య సూచకమైన ఏ వాక్యమైనా రావచ్చు నన్నమాట. ఈ రకమైన వాక్యాలకు కర్త్రనుభోక్తృ నియమాలేవీ వర్తించవు.

2.16 : ఇవికాక క్త్వార్థకక్రియకు ఇంకో విశేషమైన ప్రయోజనం ఉంది. మొదటి (ఉప) వాక్యంలో క్వార్థక క్రియ ఉన్నప్పుడు ప్రధానవాక్యం కాలగమన బోధకం కావచ్చు.

(95)

సుజాత స్నానంచేసి వారం రోజులయింది.

వారం రోజులు రూపాన్నిబట్టి బహువచననామం అయినా ఇక్కడ ఏకవచన నామంగా - అంటే వారంరోజుల కాలంగా అన్వయించుకోవాలి. అందువల్ల చివరి క్రియ ఏకత్వ బోధకంగానే ఉంటుంది. అయింది బదులు అవుతుంది అని ప్రయోగించినా భూతకాలబోధకమే అవుతుంది. ఈ వాక్యంలో వారంరోజులు బదులు కాలవరిమాణాన్ని సూచించే ఏ నామాన్నైనా ఉపయోగించవచ్చు. మానార్థకం కాని నిన్న, మొన్న వంటి మాటల మాత్రం ప్రయోగార్హం కావు. ఈ పై వాక్యం ప్రధానార్థబోధలో ఈ కింది వాక్యానికి సమానం.

(96)

సుజాత వారం రోజులకిందట స్నానం చేసింది.

పైన కాలపరిమాణాన్ని గురించి చెప్పిన నియమాలే ఈ వాక్యానికికూడా వర్తిస్తై,

(95), (96) వాక్యాలకున్న సంబంధాలు చాలాభాషల్లో సమానం. ఇట్లాంటి వాక్యాలు ఈ రకపు నంబంధాలతో అన్ని భాషల్లో ఉండవచ్చు.

(95) లో క్త్వార్థకానికి వ్యతిరేకరూపంకూడా ప్రయోగించవచ్చు. అప్పుడు. వాక్యం ఇట్లా ఉంటుంది.

(97)

సుజాత స్నానం చెయ్యక వారం రోజు లయింది.

(95) కీ (97) కీ అర్థబోధలో భేదం ఉంది. (95)లో సుజాత వారంరోజుల కిందట స్నానంచేసినట్టు మాత్రమే తెలుస్తుంది. తరవాతకూడాచేసి ఉండవచ్చు.