పుట:తెలుగు వాక్యం.pdf/41

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

సంశ్లిష్ట వాక్యాలు

27

అప్రధాన క్రియలకు రెండింటికి ఒకేకర్త ఉంటుంది. దీన్నే క్త్వార్ధకం విషయంలో "సమానాశ్రయంబులం బూర్వకాలంబునం దివర్ణకంబగు" (క్రియ. 3) అని బాల వ్యాకర్త గుర్తించి సూత్రించారు. ఈ నియమాన్ని సూచించే కింది వాక్యాలని గమనించండి.

(55)

సుజాత అన్నం తిని నిద్రపోయింది.


(56)

సుజాత అన్నం తింటూ నిద్రపోయింది.

వేరువేరు కర్తలున్న ఈ కింది వాక్యాలు వ్యాకరణ విరుద్ధాలు.

* (57)

సుజాతా అన్నంతిని సుశీల నిద్రపోయింది.


* (58)

సుజాత అన్నం తింటూ సుశీల నిద్రపోయింది.

ఈ రకమైన వాక్యాల్లో ఒకే కర్తను సూచించాలంటే, కర్తృపదంగా ఒక నామాన్నే (నామబంధాన్ని) వాడాలి. భిన్న నామాలుంటే ఒకే కర్తను సూచించ లేవు. అందువల్ల అట్లాంటివి వ్యాకరణ సమ్మతాలు కావు.

* (59)

ఆ అమ్మాయి అన్నంతిని సుజాత నిద్రపోయింది.


* (60)

ఆ అమ్మాయి అన్నం తింటూ సుజాత నిద్రపోయింది.

ఈ రకమైన వాక్యాల్లో కర్తృపదాలు రూపైకత, అర్థైకత ఉన్న నామాలే ఉండాలని, వాటిల్లో ఒకటి నిత్యంగా (సనామబంధంలోపం సూత్రంచేత) లోపించాలని పై వాక్యాలనిబట్టి తెలుస్తుంది. ఈ లోపించే వాక్యం గర్భివాక్యంలోదా? గర్భ వాక్యంలోదా ! అనే ప్రశ్నకు ఈ వాక్యంలో సమాధానం దొరకదు. ఎందుకంటే లోపించగా మిగిలిన క్రియ ప్రధానవాక్యంతోనూ ఉండవచ్చు, ఉపవాక్యంతోనూ ఉండవచ్చు.

(61)

సుజాత అన్నం తిని నిద్రపోయింది.


(62)

అన్నం తిని సుజాత నిద్రపోయింది.

ఈ రకమైన వాక్యాలు ఏకకర్తృకంగా ఉండాలనే నియమాన్ని బాలవ్యాకర్త కూడా గుర్తించినట్లు గమనించాం. కాని బాల వ్యాకర్తపైన పేర్కొన్న సూత్ర వివరణలో "సమాన కర్తృకంబు లనక సమానాశ్రయంబులనుటంజేసి చైత్రుని చేత మైత్రుండు, కొట్టంబడిమడిసె." అని చెప్పాడు దీన్ని బట్టి ఈ రకవు వాక్యాల్లో