సామాన్య వాక్యాలు
17
తాయి. తెలుసు అకర్మకక్రియ, తెలుసుకొను సకర్మక క్రియ. ఇవికాక మరికొన్ని అర్థభేదాల్ని కూడా గమనించవచ్చు. అను అంటే బయటికి మాట్లాడటం, అనుకొను అంటే ఆలోచించటం అడుగు అంటే ప్రశ్నించటం, అడుక్కొను అంటే యాచించటం. పడు అంటే పతనం కావడం, పడుకొను అంటే విశ్రాంతి తీసుకోవడం, నిద్రపోవటం.
1.247 : కొను లాగే మరికొన్ని ధాతువుల్ని క్రియలకు చేర్చటం వలన కొన్ని విశేషార్థాలు వ్యక్తమవుతై. ఇదంతమైన క్రియలకు పెట్టు చేర్చటంవలన పరప్రయోజనార్థమూ, పోవు, వేయు చేర్చటం వలన పరిపూర్ణార్థమూ వస్తై. ఈ కింది వాక్యాలు ఈ అర్థాలకు ఉదాహరణలు.
(32) | a. మా అన్నయ్య బజారునుంచి నాకు చాక్లెట్లు తెచ్చిపెట్టాడు. | |
1.248 : ఇతరభాషలలో పరిపరి విధాలుగా వ్యక్తమయే విశేషార్థాలు తెలుగులో ధాతువిస్తరణ ప్రక్రియద్వారా వ్యక్తం కావటం విశేషమైనది. ఆత్మార్థం, పరప్రయోజనార్థం ఇంగ్లీషులో నామపదాల ద్వారా వ్యక్తమవుతై. తెలుగులో ధాతువులద్వారా వ్యక్తమవుతై. తెలుగులో అన్నంత క్రియకు కొన్ని ధాతువులను చేర్చటంవల్ల కొన్ని విశేషార్థాలు వ్యక్తమవుతై. వీటిని ఇంగ్లీషులో Modals అంటారు. వివిధార్థాలు ఈ క్రింది వాక్యాలలో పదాహృత మవుతున్నై.
సామర్థ్యార్థం : కల, కలుగు.
(33) | అతను పన్నెండు ఇడ్లీలు తినగలడు . | |
కల ప్రయోగించినపుడు వాక్యంలో ప్రత్యేకంగా కాలబోధ లేకపోతే వాక్యం తద్ధర్మార్థకం అవుతుంది. దీన్ని భవిష్యత్ కాలంలో కూడా ప్రయోగించవచ్చు. కాలబోధ ప్రత్యేకంగా చెప్పాల్సి వచ్చినప్పుడు కలకు కలుగు ఆదేశమవుతుంది. వ్యతిరేకంలో కల కు లే, కలుగు కు లేక పో ఆదేశమవుతాయి.
అనుమత్యర్థం : ఇచ్చు
(34) | నన్ను లోపలికి రానియ్యి. | |