పుట:తెలుగు వాక్యం.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తెలుగు వాక్యం

1. సామాన్య వాక్యాలు

వాక్యాలను ఏ భాషలోనైనా సామాన్య, సంశ్లిష్ట, సంయుక్త వాక్యాలుగా విభజించవచ్చు. ఒక వాక్యంలో నిర్దిష్టస్థానంలో ఇంకొక వాక్యాన్ని చేరిస్తే సంశ్లిష్ట వాక్యం ఏర్పడుతుంది. ఒక వాక్యంతో ఇంకొక వాక్యాన్ని చేరిస్తే సంయుక్త వాక్యం ఏర్పడుతుంది. ఒక వాక్యంతో ఇంకొక వాక్యాన్ని చేర్చినప్పుడు కొన్ని మార్పులు జరుగుతై. ఈ మార్పుల అనంతరమే సంశ్లిష్ట, సంయుక్త వాక్యాలు ప్రయోగార్హాలు అవుతై . ఈ దృష్టితో చూసినప్పుడు సంశ్లిష్ట, సంయుక్త వాక్యాల్లో సామాన్య వాక్యలక్షణాలుండటం ఆశ్చర్యంకాదు. అందువల్ల తెలుగు వాక్య నిర్మాణాన్ని గురించి విపులంగా పరిశీలించటానికి సామాన్య వాక్యాన్ని గురించి ముందుగా తెలుసు కోటం అవసరం.

ఈ సామాన్య వాక్యాల్లోకూడా మళ్ళీ భేదాలున్నై. ఈ సామాన్య వాక్యాల్లో అతి సామాన్యమైన దాన్ని నిశ్చయార్ధకం అంటారు. సామాన్యవాక్యాన్ని కొన్ని మార్పులు చెయ్యటంద్వారా (ఆగమాదేశ వ్యత్యయాది కార్యాలు) వ్యతిరేక, ప్రశ్న, కర్మణి- మొదలైన వాక్య భేదాల్ని సాధించొచ్చు. ఇవి కాక విధి, సంప్రార్థ నాద్యర్థక వాక్యాలుకూడా ఉన్నై. ఒక వాక్యానికి కిల, సంబుద్ధ్యాద్యర్ధక ప్రత్యయాలు చేర్చటంవల్ల సామాన్యవాక్యంలో మరి కొన్ని ఆర్ధభేదా లేర్పడతై.

తెలుగు వాక్యాల్లో చెప్పుకోదగిన ఇంకో భేదం ఉంది. కొన్ని వాక్యాలు క్రియారహితాలు, కొన్ని క్రియాసహితాలు.

1.11 : క్రియారహితవాక్యాలు : క్రియారహితవాక్యాల్లో కొన్ని సహజంగా క్రియలేని వాక్యాలు, మరికొన్ని క్రియ లోపించిన వాక్యాలు ఉంటై. సహజంగా క్రియలేని వాక్యాల్లో రెండు నామబంధాలుంటై. అందులో ఒకటి ఉద్దేశ్యం, ఇంకోటి విధేయం. ఉద్దేశ్య విధేయనామాలు రెండూ ఏకవస్తు బోధకాలు. ఉద్దేశ్య నామాలు ఏ నామాలైనకావచ్చు. సర్వనామాలుకూడా కావచ్చు. విధేయనామాలు