పుట:తెలుగు వాక్యం.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తెలుగు వాక్యం : కొన్ని ముఖ్య లక్షణాలు

107

పదాలూ నామపదానికి పూర్వపరస్థానాలు రెండిట్లోనూ రాగలవు. ఉదా : ఆమెకు చాలా చీరలున్నై : ఆమెకు చీరలు చాలా ఉన్నై. క్రమ వ్యత్యయం ప్రాధాన్య వివక్షకు అవలంబించే ప్రధానమైన పద్ధతి. క్రియకు దగ్గరగా జరిగే వాటికి ప్రాధాన్యం హెచ్చు. క్రియను నామ్నీకరించి ప్రాధాన్యం చెప్పదల్చుకున్న వాటిని ఆ ఖ్యాతృ స్థానానికి జరపటంకూడా ఒక పద్ధతి. సమీకరణ వాక్యాల్లో కేవల వ్యత్యయమే ప్రాధాన్యాన్ని బోధిస్తుంది. వ్యవహృతాంశంమీద వక్త్రభిప్రాయాన్ని సూచించే అటాదిశబ్దాలు తెలుగులో ఉన్నై, ఇవిసాధారణంగా వాక్యాంతంలో వచ్చినా ప్రాధాన్యవివక్షలో వాక్యంలో ఏ పదానికైనా తగిలించవచ్చు. అప్పుడు కూడా వికల్పంగా పదక్రమ వ్యత్యయం జరుగుతుందీ

5.32 : తెలుగులో క్రియ చాలా ప్రధానమైన పాత్ర నిర్వహిస్తుంది. వాక్యాలను అనుసంధించే శబ్దాలు చాలావరకు క్రియలనుంచే నిప్పన్నమయినై . అనుకృతిలోవచ్చే అని అను ధాతునిష్పన్నం. అయితే, అయినా, కాని, కాకపోతే కాదు, కదా - వంటి మాటలు అగు ధాతు నిష్పన్నాలు. ఆత్మార్థం పారస్పరార్థం (కొను). పదార్థం (పెట్టు) పూరణార్థం (-పోవు. - వేయు) వంటి చాలా అర్థాలు ధాతువిస్తరణ ప్రక్రియ ద్వారా సాధించబడతై. క్త్వా, శతృ, ఆపి, చేదాటి వివిధోప వాక్యాలు క్రియల్లో మార్పుల వల్లనే ఏర్పడతై . (ఇంగ్లీషులో వీటికి క్రియేతర శబ్దాలు వాడతారు. ఇతర భాషల్లో relative clause అనే పద్ధతి తెలుగులో ప్రథానంగా క్రియాజన్య విశేషణం ద్వారా వ్యక్తమవుతుంది. తెలుగులో relative pronouns లేవు. ఈ రకమైన పద్ధతి తెలుగులో ఉన్న విధినిషేషాధాలతోనే బెంగాలీ భాషలో ఉంది. ఒరియాలో కూడా ఉండవచ్చు, కాని ఇతర ఆర్యభాషల్లో విరళంగా మాత్రమే ఉంది.

5.33 : తెలుగులో సమీకరణ వాక్యపద్ధతి (equative sentences) విశేషమైనది. ఈ రకమైన వాక్యాలు అన్ని భాషల్లో ఉన్నా తెలుగులో క్రియా రహితంగా ప్రయోగించటం విశేషం. ద్రావిడభాషల ప్రభావంవల్ల కాబోలు ఈ పద్ధతి ఒరియా, బెంగాలీబాషల్లోఉంది. కాని ఇతర ఆర్యభాషల్లో కనిపించదు. ఇదే పద్ధతి రష్యన్‌వంటి స్లావిక్‌భాషల్లోనూ కనిపిస్తుంది. క్రియలేని సమీకరణ వాక్యాలగుప్త నిర్మాణంలో అవు వంటి క్రియ క్రియను కొందరు ప్రతిపాదిస్తారు. కాని అర్థగ్రహణకు. అవసరంలేని అవు ను గుప్తనిర్మాణంలో ప్రతిపాదించటం అనవసరం. క్రియలేని