Jump to content

పుట:తెలుగు వాక్యం.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

104

తెలుగు వాక్యం

(241) a, b, c లలో వాటిని ఒక వాక్యంగా పరిగణించినా, భిన్న వాక్యాలుగా పరిగణించినా భేదమేమీలేదు. కాని శబ్దం గాని అనే రూపంగా మారుతుంది. క్రియారహిత వాక్యాలకు శబ్దం అంతంలో చేరుతుంది. (c లో లాగా) (230) a, b, c లలో వాక్యాలను కలపకముందు కాని శబ్దం బదులు అయితే , అయినా అనే శబ్దాలను ఆర్థభేదం లేకుండావాడొచ్చు. కాని వాటిని కలిపినప్పుడు కాని శబ్దమే ప్రయోగించాలి.

4.32 : కాని కి పూర్వపర వాకల్యను వ్యత్యస్తంచేసినా ప్రధానార్థబోధకి కాని, వైరుధ్యబోధకి కాని భంగంరాదు. వైరుధ్యబోధలో ఉపయోగించే కాని, క్రియేతర శబ్దాల మధ్య వికల్పబోధకుకూడా ఉపయోగిస్తుంది.

(242)

a. నేను రేపుగాని ఎల్లుండిగాని మీ ఇంటికి వస్తాను.
b. అబద్ధాలు చెప్పగలిగిన వాళ్ళుగాని, డబ్బు ఖర్చు పెట్ట గలిగిన వాళ్ళుగాని ఎన్నికల్లో గెలుస్తారు.