పుట:తెలుగు వాక్యం.pdf/117

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

సంయుక్త వాక్యాలు

103

(239) వాక్యాలకు యథాతథంగా ప్రయోగించవచ్చు. (238) వాక్యాల సందర్భంలో ఉదాహరించిన నాకు తెలీదు వంటి వాక్యాలను చేర్చినా చేర్చవచ్చు.

(238) వాక్యాల్లో వికల్పాఖ్యాతాలమధ్య లేక శబ్దాన్ని ఉపయోగిస్తే ప్రయోగ యోగ్యాలవుతై. లేక శబ్ద యుక్త వాక్యాలనుంచి వికల్ప వాక్యాలను నిష్పన్నంచేస్తూ లేక శబ్దాన్ని (237), (239) వాక్యాల్లో లోపింపజేసి, భిన్నా ఖ్యాతాలమధ్య లోపంచెయ్యకుండా ఉండటం (238) వాక్యాలను సాధించటంలో ఒక పద్ధతి. ఈ పద్ధతి సరిపోతుందో లేదో చెప్పటం కష్టం. -ప్రశ్నలమధ్య వికల్పం చెప్పినప్పుడు వాటిమధ్య లేక శబ్దం లేకుండానే వికల్పబోధ జరుగుతుంది.

(240)

a. అతను పైరవి కారా ? (లేక ) కాంగ్రెసు నాయకుడా ?
b. సుజాత వంట చేస్తున్నాదా? (లేక) అలంకరించుకుంటున్నదో

4.24 : -శబ్దయుక్త ప్రశ్నలమధ్య వికల్పబోధ ఉండదు. -శబ్దం క్రియేతర శబ్దాలనుంచి ప్రశ్నార్థక శబ్దాలను నిష్పన్నం చేస్తుంది. ఒక్కొశబ్దం ఒక్కోరకపు వర్గానికిగుర్తు. ఉదాహరణకు ఎప్పుడు : కాలవాచిక్రియా విశేషణం; ఎక్కడ : స్థలవాచి క్రియావిశేషణం; ఎందుకు? హేతు సూచకక్రియా విశేషణం; ఎట్లా : రీతిబోధక క్రియావిశేషణం; ఎవరు? : నామవాచకం. భిన్న ప్రవర్తన కలిగిన శబ్దాలమధ్య వికల్పబోధ ఉండదు.

4.31 : రెండు వాక్యాలమధ్య వైరుధ్య సూచనకు కాని శబ్దం ఉపయోగిస్తారు.

(241)

a. అతను లక్షలు సంపాయిస్తాడు. కాని పైసా ఖర్చు పెట్టడు.
b. ఆమె బాగా పాడుతుంది. కాని అందంగా ఉండదు.
c. అతను డాక్టరు, కాని ఇంజక్షను చెయ్యటం రాదు.

వక్త ఉద్దేశానికి భిన్నమైన విషయప్రతిపాదన జరిగినప్పుడు కాని శబ్దం ఆ వైరుధ్యాన్ని వ్యక్తంచేస్తుంది. ఉదాహరణకు (241) a లో “డబ్బు సంపాయించే వాళ్ళు ఖర్చు పెడతారు” అని వక్త అభిప్రాయం. దానికి విరుద్ధమైన ప్రతిపాదన రెండో వాక్యంలో జరిగింది. అట్లాగే (b) లో బాగాపాడే అమ్మాయి అందంగా ఉండాలని వక్త ఆశించాడు. (C) లో డాక్టరయిన వాడికి ఇంజక్షన్ ఇయ్యటం వచ్చి ఉండాలని అభిప్రాయపడటం సహజం.