86
తెలుగు వాక్యం
| b. (i) అతను నాతో “నువ్వు అభ్యుదయ కవివి" అన్నాడు. | |
(202) a, d వాక్యాలలో వక్త, అనువక్త (అనుకర్త) ఒక్కరే. ఈ సమూహంలో (a iii, d iii) వాక్యాలు (a ii, d ii) వాక్యాలకన్నా మెరుగ్గా ఉన్నై- క్రియారహిత వాక్యాలలో రెండోదళం మొదటి దళానికి విశేషణం. వక్త తన్ను గురించి వ్యాఖ్యానించుకునేటపుడు అన్నాడు అనేకన్నా చెప్పాడు అని ప్రయోగిస్తే మెరుగ్గా కనిపిస్తున్నది. ఇది ఆ వాక్యాల వ్యాకరణ వివరణకాదు. ఎందుకు మెరుగ్గా కనిపిస్తున్నయ్యో ప్రస్తుతానికి చెప్పలేకపోయినా, చెప్పాల్సిన బాధ్యత ఉంది.
(b iii), (c iii) వాక్యాల్లో నన్ను, అతన్ని అనే నామపదాలు అను అనే క్రియకు కర్మపదాలు. ఇవి క్రమంగా b (ii), c (ii) వాక్యాల్లో కర్తృపదాలు- అందువల్ల వీటిని కర్త్రుద్ధరణ ప్రక్రియకు ఉదాహరణగా గ్రహించే వీలులేక పోలేదు. అయితే (iii) సంఖ్య ఉన్న వాక్యాలు (ii) సంఖ్య ఉన్న వాక్యాలనుంచి నిష్పన్నం చేసినపుడే అట్లాంటి వివరణను గురించి ఆలోచించటం సాధ్యమవుతుంది. పైగా క్రియలున్న వాక్యాలతో ఇట్లాంటి వాక్యాలు సాధ్యం కావు.
(203) | a. నువ్వు అతనితో "నువ్వు తిన్నావు" అన్నావు. | |