84
తెలుగు భాషా చరిత్ర
ఇ>అః కొలచ్-ఇ (పై. 6,250.7, 742-98), నడప్-ఇన (పై. 10.605. 15,8), కదప్-ఇనను (EI 30.280.84.14, 972). (3) ద్వితీయాక్షరగతమైన ఊనికలేని అచ్చులు లోపించటమో చ్యుతం కావటమో జరిగేది. ఉదా. నిల్స్ -ఇ (SII 6.585. 1, 633-63 ), నిల్ప్-ఎ (NI 1.287 4; 650), పల్క్-ఇన (EI 27.230 31.7, 625 -50 ), నిల్స్-ఇరి (SII 10.600.3-4, 8), నిల్-ఇనం (EI 11.337-47.23, 725). (4) ప్రత్యయాది ఇ, ఎ,ల ముందున్న ధాతుగతవకారం యకారంగా మారేది. ఉదా. పో-యె/పోయ్-ఎ. ( పై. 24.183-931.11, 825 ), పోయ్-ఇన (SII 6.102 23.24, 1006). (5) తుమర్థక ప్రార్ధనాద్యర్థక ప్రత్యయాలు చేరినపుడు ధాతుగతమైన అద్విరుక్త హల్లుకు ముందున్న అచ్చుదీర్థ౦గాను, ద్విరుక్తహల్లుకు ముందున్న ఆచ్చుహ్రస్వంగాను, పర్యాయరూపత పొందేవి. ఉదా. కొ-Ø-మ్మ్ (తె. శా. 1.163-65.32, 892,922 ), పో-Ø-మ్. (NI 8.245.5. 10), పొయ్య్-అ (SII 5.71.8-9. 1099 ). వీటిలోని 'పోము' అవ్యాకృతరూపమై 'పొమ్ము' సాధురూపంగా నిలిచింది; 'పోయ' సాధురూపమై 'పొయ్య' అసాధువై పోయింది. (6) తుమర్ధక ప్రత్యయం ముందున్న ధాతుతుగతచకారం వకారంగా మారేది. ఉదా. కావ్-అన్ (తె. శా. 1,163.65 73-74, 892-922). (7) 'ఈ'ధాతు తుమర్థకరూపం 'ఈయ్ అన్' ( పై. 44 ) అని కనిపిస్తుంది. ప్రత్యయాచ్చుముందు. యడాగమం జరిగిందన్నమాట. (8) ప్రత్యయాద్యచ్చు లోపించటంవల్ద ప్రాతిపదిక స్వరూపంలో వర్ణనమీకరణం జరిగి మార్చు వచ్చేది. ఇది రెండురకాలు (i) మన్-న (ప్రై. 74) వంటి రూపాల్లో పురోగామిసమీకరణమూ ఇడ్డ్-అ (శా. ప. మం. 1.2-3.41, 898-934). ఉన్న్-అ (భారతి 5.618. 12, 897), కొణ్న్-అ (SII 10.611.2.8) వంటి రూపాల్లో తిరోగామిసమీకరణమూ కనిపిస్తాయి.
3.45. భూతకాలిక సమాపక్రియ : భూతకాలిక సమాపక క్రియలకు ముఖ్యంగా రెండువర్గాల ప్రత్యయాలు చేరేవి. వాటిలో మొదటివర్గానికి చెందినవి 'ఇ, ఇతి, ఇన్, Ø ' అనే సపదాంశాలు. అందులో మొదటి రెండూ హలాది పురుష ప్రత్యయాలకు ముందురాగా, మూడోది అజాది పురుష ప్రత్యయాలకు ముందు వచ్చేది. నాలుగోది ధాత్వంత యకారానికి పురుష ప్రత్యయానికి మధ్య మాత్రమే వచ్చేది. ఉదా. ఇచ్ఛ్-ఇ-రి ( పై. 599.30.31, 625-50 ), ఇచ్చ్-ఇతి-రి.