Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

80

తెలుగు భాషా చరిత్ర

1094), నూర్-వ్వురు (పై. 6.109.16, 1076).

   1000. వెయి (NI 3.1152-55.46, 7); వేయు (SII 6.585 13, 633-63), వే-ల్‌ (పై. 10.4.13, 1008); వే-గ విలాళు (భారతి 5.935-48.14, 675), వే-వురు ( పై. 16), వే-వ్రు (SII 6 584.12, 641), వే-గురు (పై. 10.644.105, 1060).
    ఇవిగాక సంఖ్యావాచకాలయిన ఎరువు మాటలు కొన్ని దొరుకుతున్నాయి. వాటిలో ప్రాకృతం నుంచి వచ్చిన దువ (=రెండు, EI 9.47.59, 945-46), తిణ్ణి ( =మూడు, IA 185-91.28,668-69 ), చౌ ( =నాలుగు, భారతి 5.618,3,850), బారస ( = పన్నెండు SII 10.645.10, 1060), సత్తిగ (=ఇరవై ఒకటి, పై. 6.102.5-6, 1006), పాతిక (= ఇరవై అయిదు, AR 75/1956-57.18, 1080), వంద ( = నూరు, SII 5.21.5-6,1078) మొదలైనవీ, సంస్కృతంనుంచి వచ్చినత్రి ( = మూడు, CP 13/1908-9,19, 709 ), నవ ( = తొమ్మిది,  SII 5 1347.4, 1093), షస్టి( = అరవై, భారతి, 5.618 3, 850), నవతి ( = తొంభై. SII 5.1347.4, 1093), సహస్ర (ప్తె. కోటి (NI 2.607-7.8, 1074 ) మొదలైనవీ కనిపిస్తాయి. అర (SII 5.21.11, 1078 ) వంటి దేశ్యపదంతోను, అడ్డ (పై. 4.1014,4, 1036), ఆద (పై. 10.29.11, 971) వంటి ప్రాకృతపదాలతోను, అర్ధ (తె. శా. 1.163.65, 15,892-922) వంటి సంస్కృత పదంతోను సగభాగాన్ని నిర్టేశించేవారు.
  
   3.39. విశేషణాలు : విశేషణాలు అనేక విధాలు (1) విశేష్యాలకు ముందు మాత్రమే వచ్చే అస్వతంత్ర ప్రాథమిక విశేషణాలు ఒకరకం. ఆ, ఈ, ఏ- అనే త్రికం ఈరకానిది. క్రీ. శ. : ఏడో శతాబ్దినుంచి పదకొండో శతాబ్ది దాకా త్రికసంధి వైకల్పికంగానే ఉండేది. త్రికంమీది హల్లు ద్విత్వమైనప్పుడు త్రికదీర్ధ స్వరం వైకల్పికంగా హ్రస్వమయ్యేది. ఉదా. అ-బసిణ్డి (JAHC 3.16-21. 16-17, 678). అ-బ్బారణాసి (శా.ప.మం 1.2-3.12-13, 898-934), ఈ-ఊడ్లందు (SII 6.585. 9, 633-63 ). ఇ-య్యొట్టు (శా. ప. మ. 1 2-3,14, 898-984 ), ఇ- ప్ప్రతిమ (SII 10.633.3,3 ), ఎ-వ్వర్‌ (భారతి 23.182-86, 14, 641). ఇక్కడి ఆగమ యకారమూ సంయుక్త హల్లులోని