పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రాచీనాంధ్రం : శాసనభాషా పరిణామం

75

యావ్వు౯రుబోల,. ( పై. 1008.12,1047 ). 'లోపల' శబ్దాన్ని 'డాపల, వలపల, వెలుపల 'శబ్దాలతో పోల్చినప్పుడు* -పల అన్నభాగం ప్రత్యయమేమో ననిపిస్తుంది. విడిగా 'లో' శబ్దం వాడుకలో ఉండటం ఈ అనుమానానికి బలమిస్తున్నది.         
     3.36 నిర్మాణ క్రమాన్ని బట్టి సర్వనామాలను విశేష్యాలను ఒక్కటిగనే భావించాలి. ఇవి ముఖ్యంగా మూడు రకాలు. లింగవచన సూచకాలుగల నిర్దేశ సర్వనామాలు ఒకరకం. అట్లు మొదలైన అవ్యయాలూ, అది, ఆమె, వాడు మొదలైన 'విశేషణాలూ' ఈ రకానికి చెందినవి. లింగబోధలేని ఆత్మార్థక, పురుషవాచక, సర్వనామాలూ రెండుమూడు రకాలవి. ప్రశ్నవాచక సర్వనామాలు మొదటి రకానికి చెందినవే. అ, ఇ, అనే ప్రాతిపదికలనుంచి ఏర్పడ్డ నిర్దేశ సర్వనామాలు కొన్ని మాత్రమే శాసనభాషలో కనిపిస్తాయి. ఉదా. మహన్మహతీవాచకాలు : ఏక వాన్ఱు (పై. 10.606.18-19, 600-25); వాణ్డు (పై. 599.33,625-50); వాని ( EI 11.337-29. 725):- ఆతణ్ణ్ ( భారతి 5 618.11.897 ); ఆతని (తె. శా. 1.169-65.53. 892-922) ; వీని (SII 10.59 10.1039). వీన్ఱి (పై. 628.8 825).
     బహు, వారు (పై. 607.10,575-600); వారల (శా.ప.మం. 1.2-3.18. 898-934); వీరి (SII 10 3-4,8) ; వీరల (పై. 605.8.8).
    (ii) అమహద్వాచకాలు : ఏక. (ఇచ్చిన్) అది (EI 27.234-36-16. 625-50); దానిక (శా. ప. మం. 1.2-3. 41, 898-934) ; ఇది ( SII 10.598.32, 925-56); దీని (పై. 606.17,600.25); దేని (భారతి 23.182- 86.13,641).
    (iii) ఇన్ఱు (SII 10.45.2.7); ఇన్దు (తె. శా. 1.163-65.74, 892-922); ఇన్దుల ( NI 1,245.3,10 );. ఇన్దోఱు (ఆం. ప. 1941.42-14-15.4, 600-25); ఇన్దూఱు (SII 10.600.7-8, 8).
     సర్వనామాల నిర్మాణక్రమం : పై వాటిలోని'వీన్ఱి'నేటి'వీడి' (< *వీణ్డి)కి పూర్వరూపం. *ఇదని అనే పూర్వరూపం నుంచి ఏర్పడ్డ 'దీని,దేని' అనే వాటిలో 'దేని' అనేదే సాధారణ రూపమైనా, *ఎదని నుంచి ఏర్పడ్డ 'దేని'తో సమానరూప